CM KCR : పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం స్టార్ట్

ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నార్లాపూర్ వ‌ద్ద శ‌నివారం తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా కేసీఆర్ కు భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది. దారి పొడ‌వునా నిల్చుని సీఎంకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

CM KCR Inaugurates Palamuru Project

అపూర్వ‌మైన ఘ‌ట్టం ఇవాళ ఆవిష్కృత‌మైంది. గ‌తంలో ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో పాల‌మూరు జిల్లా దోపిడీకి గురైంది. వివ‌క్ష‌కు లోనైంది. వ‌ల‌స‌ల‌కు పెట్టింది పేరు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిందో ఆనాటి నుంచి కేసీఆర్ అభివృద్దిపై ఫోక‌స్ పెట్టారు.

ఇవాళ ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు, నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌ను నిర్మించేందుకు ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు సీఎం. రాష్ట్ర ఇంజ‌నీరింగ్ చ‌రిత్ర లోనే మ‌రో అపూర్వ‌మైన ఘ‌ట్టం ఆవిష్కృతం కావ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం జాతికి అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేసీఆర్.

నార్లాపూర్ పంప్ హౌస్ వ‌ద్ద 145 మెగా వాట్ల సామ‌ర్థ్యం ఉన్న మోటార్ల‌ను ఆన్ చేశారు. జ‌లాల ఎత్తిపోత‌ల‌ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఆ త‌ర్వాత అంజ‌న‌గిరి రిజ‌ర్వాయ‌ర్ లోకి చేరిన కృష్ణ‌మ్మ జలాల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

Also Read : India Big Shock : మోడీ మీడియాకు ఇండియా షాక్

Leave A Reply

Your Email Id will not be published!