Tummala Nageswar Rao Joins : కాంగ్రెస్ లోకి తుమ్మ‌ల జంప్

హ‌స్తం గూటికి మాజీ మంత్రి

Tummala Nageswar Rao Joins : హైద‌రాబాద్ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఆధ్వ‌ర్యంలో శ‌నివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణు గోపాల్ ఉన్నారు.

Tummala Nageswar Rao Joins in Congress

గ‌తంలో ఆయ‌న తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్నారు. మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత టీడీపీకి ఫ్యూచ‌ర్ లేకుండా పోయింది. తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావుకు(Tummala Nageswar Rao) ఖ‌మ్మం జిల్లాలో మంచి ప‌ట్టుంది. ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి కేసీఆర్ తో ప‌రిచ‌యం ఉండ‌డంతో బీఆర్ఎస్ లో చేరారు.

ఎమ్మెల్సీ గా ఛాన్స్ ఇచ్చారు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావుకు సీఎం . ఆ త‌ర్వాత కేబినెట్ లోకి చేర్చుకున్నారు. ఆ త‌ర్వాత ఇటీవ‌ల కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి 115 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. కానీ ఖ‌మ్మం లో ప‌ట్టు క‌లిగిన తుమ్మ‌ల‌కు ఛాన్స్ ఇవ్వ‌లేదు.

దీంతో త‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో అసంతృప్తికి గుర‌య్యారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.

Also Read : CM KCR : పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం స్టార్ట్

Leave A Reply

Your Email Id will not be published!