India Comment : మీడియా పక్షపాతం ఇండియా ఉక్కుపాదం

ఘోడీ మీడియాకు కోలుకోలేని ఝ‌ల‌క్

India Comment  : భార‌త దేశ చ‌రిత్ర‌లో ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి ఇండియా కూట‌మిగా ఏర్పాటు అయ్యాయి. ఈ కూట‌మిలో పేరు పొందిన 28 ప్ర‌తిప‌క్ష పార్టీలు భాగ‌స్వామ్యంగా ఉన్నాయి. మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ , సంకీర్ణ స‌ర్కార్ అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌డుతూ వ‌స్తోంది. త్వ‌ర‌లో 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే మోదీ వ‌ర్సెస్ విప‌క్షాలు మాట‌ల యుద్దానికి తెర లేపాయి. ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల‌లో కొలువు తీరాయి. ఇందులో భాగంగా ప్ర‌తిప‌క్షాల కూట‌మి(India Alliance) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మోదీ ప్ర‌భుత్వానికి గంప గుత్త‌గా మ‌ద్ద‌తు ప‌లికే ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, డిజిట‌ల్ మీడియాను తాము వ్య‌తిరేకిస్తున్న‌ట్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశానికి స్వ‌తంత్రం రాక ముందు పత్రిక‌లు కీల‌క మైన పాత్ర పోషించాయి. దేశానికి స్వేచ్ఛ ల‌భించిన త‌ర్వాత కూడా ప‌త్రిక‌లు కొన‌సాగాయి.

India Comment Viral

ఆ త‌ర్వాత ఛాన‌ళ్లు ఏర్పాటు అయ్యాయి. ప్ర‌జ‌ల వాయిస్ ను వినిపిస్తూ వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో ప్రింట్, మీడియాకు కోలుకోలేని రీతిలో డిజిట‌ల్ మీడియా రానే వ‌చ్చింది. ఇది వ‌చ్చాక మీడియాలో పెను సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌తిప‌క్షాలతో పాటు అధికారంలో ఉన్న మోదీ స‌ర్కార్ సైతం హోరెత్తిస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ అస్త్రాలు ప్ర‌యోగిస్తున్నాయి. 2014 తర్వాత కొలువు తీరాక పూర్తిగా మీడియాలోని 80 శాతానికి పైగా ప‌త్రిక‌లు, ఛాన‌ళ్లు, డిజిట‌ల్ మీడియా గంప గుత్త‌గా మోదీని, ఆయ‌న ప‌రివారాన్ని, కాషాయాన్ని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను, ప్ర‌భుత్వాన్ని , సంకీర్ణ పార్టీల‌ను , మంత్రులు, ఎంపీల‌ను మోస్తూ వ‌చ్చాయి. వారికి నేరుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ వ‌చ్చాయి. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ఇండియా కూట‌మి.

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇక నుంచి ఘోడీ (మోడీ) మీడియాకు కోలుకోలేని ఝ‌ల‌క్ ఇచ్చింది. తాము మోదీని మోస్తున్న మీడియాను నిషేధిస్తున్న‌ట్లు తాము స‌పోర్ట్ చేసే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌క‌టించింది. మూకుమ్మ‌డిగా ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భార‌త దేశంలోని ఆయా రాష్ట్రాల‌లో కొలువు తీరిన ముఖ్య‌మంత్రులు సంత‌కం చేశారు. ప్ర‌క‌టించిన వారిలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం బాఘేట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, ఢిల్లీ, పంజాబ్ సీఎలు భ‌గవంత్ మాన్ , అర‌వింద్ కేజ్రీవాల్ , త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఇది ఒక ర‌కంగా సంచ‌ల‌న నిర్ణ‌యం అని చెప్ప‌క త‌ప్ప‌దు. మీడియా అన్న‌ది ప్ర‌జాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండాలే త‌ప్పా ఇంకొక‌రికి వ‌త్తాసు ప‌లికితే ఎలా అని ప్ర‌శ్నించింది ఇండియా కూట‌మి. రాబోయే రోజుల్లో ఈ నిర్ణ‌యం ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుందో వేచి చూడాలి.

Also Read : Tummala Nageswar Rao Joins : కాంగ్రెస్ లోకి తుమ్మ‌ల జంప్

Leave A Reply

Your Email Id will not be published!