Posani krishna Murali : అత్తా కోడళ్లపై పోసాని ఫైర్
పవన్ కు ఎలా సపోర్ట్ చేస్తారు
Posani krishna Murali : అమరావతి – ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర అభివృద్ది సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. అత్తా కోడళ్లైన నారా భువనేశ్వరి , నారా బ్రాహ్మణి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు తండ్రి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎక్కడ ఉన్నారంటూ భువనేశ్వరిని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి చిలుక పలుకులు పలకడం విడ్డూరంగా ఉందన్నారు పోసాని కృష్ణ మురళి.
Posani krishna Murali Serious Comments
ఆనాడు తెలుగుదేశం పార్టీని అమ్మనా బూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ ఎలా టీడీపీకి ఆప్తుడు అయ్యాడో ప్రజలకు చెప్పాలన్నారు. తన తల్లిని ఆనాడు తిట్టిన ఫైర్ అయిన జనసేనాని ఇప్పుడు రూట్ మార్చాడని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లను ఏకి పారేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి చంకలోకి ఎలా జొర్రాడంటూ ప్రశ్నించారు.
హెరిటేజ్ షేర్ 2 శాతం అమ్మితే రూ. 400 కోట్లు వస్తాయని చెప్పిన భువనేశ్వరి దాని లెక్కలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు పోసాని కృష్ణ మురళి(Posani krishna Murali). జైలులో కూర్చుని కూడా చంద్రబాబు నాయుడు నా ప్రజలు అంటూ పలవరిస్తున్నారని భువనేశ్వరి చెప్పడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు. ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచి పవర్ లోకి వచ్చిన బాబు సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. ఇకనైనా తమ తప్పు తెలుసుకుంటే బెటర్ అని పేర్కొన్నారు.
Also Read : YS Sharmila Joins : షర్మిలకు లైన్ క్లియర్