Mynampally Hanumantha Rao : కేసీఆర్ మోసానికి చిరునామా

మైనంప‌ల్లి హ‌న్మంత రావు ఫైర్

Mynampally Hanumantha Rao : హైద‌రాబాద్ – మ‌ల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తోంద‌ని ఆరోపించారు. ద‌ళిత బంధు, బీసీ బంధు , రైతు బంధు , డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీంల‌న్నీ ప్ర‌జ‌ల‌కు ఒరిగింది ఏమీ లేద‌న్నారు. ఆల్ రెడీ ఇప్ప‌టికే ఇండ్లు ఉన్న వారికి తిరిగి ఫ్లాట్స్ కేటాయిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.

Mynampally Hanumantha Rao Comments

రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో 2 లక్ష‌ల‌కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు. లీకేజీలు, స్కామ్ లు, దాడులు, క‌బ్జాల‌కు బీఆర్ఎస్ కేరాఫ్ గా మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మైనంప‌ల్లి హ‌నుమంత రావు.

రాష్ట్రంలో నిరుద్యోగులు, పోలీసులు తీవ్ర నిరాశ‌లో మునిగి పోయార‌ని ఎవ‌రూ కూడా బీఆర్ఎస్ స‌ర్కార్ ప‌ట్ల సానుకూలంగా లేర‌ని స్ప‌ష్టం చేశారు మైనంప‌ల్లి(Mynampally Hanumantha Rao). ఈసారి రాష్ట్రంలో మార్పు కోరుకుంటార‌ని , త‌ప్ప‌కుండా కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని జోష్యం చెప్పారు. ఇదిలా ఉండ‌గా మైనంప‌ల్లి తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు.

Also Read : AP Govt Announce : ఏపీలో 25 వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు

Leave A Reply

Your Email Id will not be published!