AFG vs SL ICC World Cup : సెమీస్ పై ఆఫ్గాన్ ఫోకస్
వరుస విక్టరీలతో ఫుల్ జోష్
AFG vs SL ICC World Cup : పుణె – ఐసీసీ(ICC) ఆధ్వర్యంలో బీసీసీఐ నిర్వహిస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి దాకా పిల్ల కూనలుగా అండర్ ఎస్టిమేట్ వేసిన జట్లకు కోలుకోలేని షాక్ తగులుతోంది. ప్రధానంగా ఆసియా ఖండానికి చెందిన ఆఫ్గనిస్తాన్ జట్టు అద్భుత విజయాలు నమోదు చేస్తోంది.
AFG vs SL ICC World Cup Updates
టోర్నీలో భాగంగా మహారాష్ట్ర లోని పుణె లో జరిగిన కీలక మ్యాచ్ లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్గనిస్తాన్ జట్టు ఇప్పుడు అన్ని విభాగాలలో పటిష్టవంతమైన స్థితిలో ఉంది. దీనికి కారణం ఆ జట్టును అద్బుతంగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అజయ్ జడేజా.
మనోడు భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజాహరుద్దీన్ కు అనుచరుడిగా పేరు పొందాడు. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ జట్టు ఇప్పటి దాకా స్కాట్లాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ ను ఓడించింది. తాజాగా శ్రీలంకను పరాజయం పాలు చేసింది. క్రికెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లంక 49.3 ఓవర్లలో 241 కు ఆలౌటైంది. ఆ తర్వాత ఆఫ్గనిస్తాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read : TUWJ Slams : జర్నలిజాన్ని బద్నాం చేస్తే సహించం
