BJP Final List : అభ్య‌ర్థుల ఎంపిక‌పై బీజేపీ భేటీ

సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ కమిటీ స‌మావేశం

BJP Final List : న్యూఢిల్లీ – తెలంగాణ‌లో తుది జాబితా ఎంపిక‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించింది భార‌తీయ జ‌న‌తా పార్టీ హైక‌మాండ్. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు తొలి , రెండు విడతులుగా ప్ర‌క‌టించింది పార్టీ. ఇప్ప‌టి వ‌ర‌కు 53 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసింది.

BJP Final List Will be Announce

ఈ స్థానాలు కాకుండా మిగ‌తా 66 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది. న్యూఢిల్లీలో బీజేపీ(BJP) స్టేట్ చీఫ్‌, కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి, ఎంపీ ల‌క్ష్మ‌ణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ తో పాటు జేపీ న‌డ్డా , కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ స‌మావేశం కానుంది.

ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై ఇప్ప‌టికే రాష్ట్ర పార్టీ కీల‌క నివేదిక స‌మ‌ర్పించింది. మ‌రో వైపు ఆంధ్రా షెటిల‌ర్స్ ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు బీజేపీ ఫోక‌స్ పెట్టింది. ఇందులో భాగంగా కిష‌న్ రెడ్డి, ల‌క్ష్మ‌ణ్ లు స్వ‌యంగా జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లుసుకున్నారు. త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

మ‌రో వైపు టీడీపీ కూడా తెలంగాణ‌లో బ‌రిలో ఉండ కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. ఈ ఓట్లు కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు వెళ్లే అవ‌కాశాలు లేక పోలేదు. సాయంత్రం ఆరు గంట‌ల‌కు మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మ‌య్యే టీం అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తుంది.

Also Read  : Revanth Reddy : కేసీఆర్ కుటుంబం తిన్న‌దంతా క‌క్కిస్తం

Leave A Reply

Your Email Id will not be published!