MLA Raja Singh : కేసీఆర్ ఖేల్ ఖతం – రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
MLA Raja Singh : హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీకి చెందిన గోషా మహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్(MLA Raja Singh). భారత రాజ్యాంగాన్ని మారుస్తానని పదే పదే చెబుతూ వచ్చారని , కానీ విచిత్రం ఏమిటంటే కేసీఆర్ ను వద్దని అనుకున్నారని అన్నారు. చివరకు గత్యంతరం లేక రాక్షస పాలన వద్దని ప్రజలు పూర్తిగా తననే మార్చేశారంటూ ఎద్దేవా చేశారు.
MLA Raja Singh Serious Comments on KCR
బుధవారం రాజా సింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కొలువు తీరిన , 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు సర్కార్ నడప లేదన్నారు . ఏడాది మాత్రమే ఆ పార్టీ పవర్ లో ఉంటుందన్నారు రాజా సింగ్.
త్వరలోనే తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జోష్యం చెప్పారు. కేసీఆర్ ఊహించని రీతిలో అప్పులు చేశారని , జనం నెత్తిన టోపీ పెట్టారంటూ మండిపడ్డారు. అప్పులు పూడ్చడంతోనే కాంగ్రెస్ పార్టీకి సమయం సరి పోతుందని ఇక ఎలా రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారంటూ ప్రశ్నించారు రాజా సింగ్.
ఎన్నికల ప్రచారం సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తుందని పేర్కొన్నారు బీజేపీ ఎమ్మెల్యే. కేసీఆర్ ఖేల్ ఖతమైందని , పార్టీ బతకడం కూడా కష్టమేనని స్పష్టం చేశారు.
Also Read : DK Shiva Kumar : కేబినెట్ పై హైకమాండ్ దే ఫైనల్
