Prakash Raj : కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ పరామర్శ
ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రముఖులు
Prakash Raj : హైదరాబాద్ – ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడడంతో ఆస్పత్రి పాలైన బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయనను పరామర్శించేందుకు ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు , ప్రముఖులు క్యూ కట్టారు.
Prakash Raj Met KCR
తాజాగా ముందు నుంచీ కేసీఆర్ కు, ఆయన పార్టీకి, ఆయన ఆలోచనలకు , నిర్ణయాలకు మద్దతు ఇస్తూ వస్తున్నారు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj).
తాజాగా ఆయన కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ సీఎం తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు. కేసీఆర్ ను దగ్గరుండి చూసుకుంటున్నారు కొడుకు కేటీఆర్, కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
సోమవారం కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేసిన వారిలో మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ మాలోతు కవిత, లక్ష్మి నరసింహారావు ఉన్నారు.
Also Read : Jana Reddy : హైకమాండ్ చెబితే ఆలోచిస్తా
