Kadiyam Srihari : కాంగ్రెస్ సర్కార్ పై కడియం కన్నెర్ర
కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు అబద్దం
Kadiyam Srihari : హైదరాబాద్ – మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) సంచలన కామెంట్స్ చేశారు. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు.
Kadiyam Srihari Slams Congress
ఈ సందర్బంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు కడియం శ్రీహరి.
తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిధులను ఖర్చు చేసిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో టాప్ లో నిలిచేలా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ. 93 వేల కోట్లు మాత్రమేనని కానీ మంత్రులు లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చిల్లర ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, దళిత బంధు, పెన్షన్ , షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
Also Read : Bhatti Vikramarka : కార్మికుల సంక్షేమాన్ని విస్మరించొద్దు