Chandrababu and Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ డిన్నర్ మీటింగ్ ! సీట్ల సర్ధుబాటుపై చర్చ ?

చంద్రబాబుతో పవన్ డిన్నర్ మీటింగ్ ! సీట్ల సర్ధుబాటుపై చర్చ ?

Chandrababu and Pawan Kalyan: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు నాదేండ్ల మనోహర్ తో కలిసి ఉండవల్లి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుతో పాటు లోకేష్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నారా లోకేష్‌ తో పాటు నాదెండ్ల మనోహర్, ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. టీడీపీ – జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు బీజేపీతో పొత్తు, జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీల నుంచి వస్తున్న వలసలపై చర్చించారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానించాలని బాబు, పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Chandrababu and Pawan Kalyan Meeting Viral

వైసీపీ అధిష్టానం ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించడంతో… తొలి జాబితాను విడుదల చేయడానికి ఇరుపార్టీల అధినేతలు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధులుగా ఎవరెవరు పేర్లు ప్రకటించాలన్న దానిపై చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్ తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. మరోవైపు భోగి రోజు తెల్లవారుజామున అమరావతిలోని మందడంలో భోగి మంటల వేడుకలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పాల్గొనడానికి ఏర్పాటు చేసారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దగ్ధం చేయనున్నారు. ఇరువురి నేతల రాక సందర్భంగా టీడీపీ, జనసేన సిద్ధాంతాలు ప్రతబింభించేలా ముగ్గులు వేసారు పార్టీ నాయకులు కార్యకర్తలు.

Also Read : MP Vallabhaneni Balasouri: వైసీపీకు మరో షాక్ ! మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా !

Leave A Reply

Your Email Id will not be published!