CM Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో కోర్టు ముందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ !

మద్యం కుంభకోణం కేసులో కోర్టు ముందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ !

CM Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ప్రభుత్వ మద్యం పాలసీపై ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన నోటీసులకు సీఎం కేజ్రీవాల్(CM Arvind Kejriwal) స్పందించకపోవడంతో… ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. సీఎం కేజ్రీవాల్‌ విచారణకు సహకరించడం లేదంటూ రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఎంకు సమన్లు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన నేడు కోర్టు ఎదుట వర్చువల్‌ గా హాజరయ్యారు. అయితే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని… తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని కేజ్రీవాల్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం… తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

CM Arvind Kejriwal Comments Viral

మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ లో సీబీఐ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను తొమ్మిది గంటల పాటు విచారించారు. అనంతరం ఇదే కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు… కేజ్రీవాల్ కు నోటీసులు పంపించారు. ఈడీ అధికారులు ఐదు సార్లు నోటీసులు పంపించినప్పటికీ సీఎం కేజ్రీవాల్ స్పందించలేదు. దీనితో ఆరో సారి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ఫిబ్రవరి 19న విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది. అయినప్పటికీ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో… వారు కోర్టును ఆశ్రయించారు. దీనితో సీఎం కేజ్రీవాల్ కోర్టుకు ముందు హాజరుకావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 19న ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతారా ? లేదా ? అనే సస్పెన్స్‌ నెలకొంది.

Also Read : Chandrababu Naidu : ఏపీలో అభ్యర్థుల ఎంపికపై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!