BJP-BJD Alliance: ఆశక్తికరంగా ఒడిశా రాజకీయాలు ! 15 ఏళ్ల తర్వాత బీజేపీ-బీజేడీ పొత్తు ?
ఆశక్తికరంగా ఒడిశా రాజకీయాలు ! 15 ఏళ్ల తర్వాత బీజేపీ-బీజేడీ పొత్తు ?
BJP-BJD Alliance: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒడిశా రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ(బిజూ జనతా దళ్ పార్టీ) కు ప్రత్యామ్నాయంగా ఇన్ని రోజులు చెప్పుకునే బీజేపీ… త్వరలో ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. మిషన్ 370 లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం పొత్తులకు సిద్ధమౌతున్నారు. దీనిలో భాగంగా ఎన్డీయే కూటమిలోనికి బీజేడీ చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీ, బీజేడీ నేతల మధ్య జరుగుతున్న సంప్రదింపులు ఆ వాదనలకు బలం చేకూర్చుతున్నాయి. అదేగాని జరిగితే దాదాపు 15 ఏళ్ళ తరువాత బీజేపీ, బీజేడీ లు పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం ఎక్కువగా పార్లమెంట్ స్థానాలపై గురిపెట్టి… స్థానిక పార్టీలకు అసెంబ్లీల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ కూడా బీజేపీతో పొత్తుకు సిద్ధపడుతుందని అనే ప్రచారం జరగుతోంది.
BJP-BJD Alliance Updates
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం‘నవీన్ నివాస్’లో బీజేడీ నేతల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డీయేలో చేరిక, బీజేపీతో పొత్తుపై చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ(BJP) నాయకత్వం ఢిల్లీలోని పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తో పాటు పలువురు కీలక నేతలు ఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో బీజేడీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా పొత్తుపై చర్చించినట్టు మీడియాకు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని … తాము ఏ నిర్ణయం తీసుకున్నా… ఒడిషా ప్రజల ప్రయోజనం కోసమేనని చెప్పుకొచ్చారు.
మరోవైపు బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు, ఎంపీ జుయల్ ఓరం మాట్లాడుతూ… బీజేడీతో(BJD) పొత్తుపై ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ కేంద్ర నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. ఫైనల్ నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ-బీజేడీ పొత్తు ఖాయమనే ప్రచారం ఇరు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలో 1998లో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా 1998, 1999, 2004లో లోక్‌సభ ఎన్నికలు, 2000, 2004 సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఇరు పార్టీలు సత్తా చాటాయి. అయితే 2009లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో బీజేడీకి తక్కువ స్థానాలు ఇవ్వడంతో కూటమి విడిపోయింది. దీనితో దాదాపు 15 ఏళ్ల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : YS Sharmila : ఏపీలో ఆ మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసిన బీజేపీకి ఓటు వేసినట్టే…