Kalvakuntla Kavitha : ముఖ్యమంత్రి రేవంత్ రేసుగుర్రం కాదు గుద్ది గుర్రంలా కనిపిస్తున్నారు

రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు

Kalvakuntla Kavitha : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మూడునెళ్ల ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారు రేసుగుర్రం కాదు గుడ్డి గుర్రం అంటూ సెటైర్లు వేస్తున్నారు. జీవో3ని రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా ముగిసింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అధిక శాతం కేటాయించాలని, గత ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Kalvakuntla Kavitha Slams..

రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. అమ్మాయి చనిపోతే తనను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును సాకుగా చూపి రేవంత్ రెడ్డి పారిపోయాడన్నారు. జివో3 నిజమైతే 30 వేల ఉద్యోగాలకు ఎన్ని రిజర్వేషన్లు అమలు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగులు అయోమయంలో ఉన్నారు… నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్త్రీ తో పెట్టుకున్న వారెవరూ బాగుపడరని…తమ పోరాటం మహిళల కోసం తప్ప, పురుషులకు అన్యాయం చేయాలనీ కాదన్నారు. రిజర్వేషన్ విధానాన్ని హారిజాంటల్ పద్దతిలో ప్రవేశపెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

Also Read : Malla Reddy : కేసీఆర్ తో మళ్ళా రెడ్డి ముఖాముఖి..పార్టీ మారడంపై కీలక ప్రకటన

Leave A Reply

Your Email Id will not be published!