Pulivarthi Nani: పులివర్తి నాని సెక్యూరిటీపై హైకోర్ట్ కీలక ఆదేశాలు !
పులివర్తి నాని సెక్యూరిటీపై హైకోర్ట్ కీలక ఆదేశాలు !
Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి భద్రత కల్పించాలంటూ ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థికి 1+1 భద్రత కేటాయించాలని న్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది. తనకు భద్రత కల్పించాలంటూ ఎస్పీకి పులివర్తి నాని విజ్ఞప్తి చేశారు. అయితే ఎస్పీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో నాని హైకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిగణలోనికి తీసుకున్న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సోమవారం టీడీపీ అభ్యర్థి పిటిషన్ పై విచారణ జరిపింది.
Pulivarthi Nani Security..
పులివర్తి నాని తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఇచ్చి, తర్వాత తొలగించారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. ఎస్పీకి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదని ఉమేష్ చంద్ర చెప్పారు. పోటీ చేసిన అభ్యర్థికి సెక్యూరిటీ ఇవ్వాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు ఈ రోజు నుంచి పులివర్తి నానికి, ఆయన కుటుంబ సభ్యులకు 1+1 భద్రత కల్పించాలంటూ హైకోర్టు ధర్మాసం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : Kingfisher Beer: కింగ్ ఫిషర్ బీర్ల కోసం ప్రభుత్వానికి మంచిర్యాల వాసి లేఖ !