Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైలు సమయంలో స్వల్ప మార్పు !

హైదరాబాద్‌ మెట్రో రైలు సమయంలో స్వల్ప మార్పు !

Hyderabad Metro Rail: మెట్రో రైలు ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ హైదరాబాద్ మెట్రో సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు తమ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Hyderabad Metro Rail Updates

ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలు నిర్వహించేలా ఇటీవల అధికారులు ట్రయల్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు… తాజాగా శుక్రవారాల్లో రాత్రి 11.45గంటల వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read : YS Sharmila: లండన్‌ లో విహరిస్తోన్న జగన్‌ కు ఇక్కడి మహిళల ఆర్తనాదాలు వినిపించవు – షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!