ISIS Terrorists : చిన్నారులను చంపి వండుకొని తింటున్న ఐసిస్ మూకలు

తర్వాత మాకు అన్నం, మాంసం పెట్టారు. మాంసాహారం తింటున్న సమయంలో దుర్వాసన వచ్చింది...

ISIS : ఐసిస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఐసిస్ చేతిలో బందీలుగా మారిన శిశువులను చంపి వారి మాంసంతో కూర వండేవారట. అనంతరం ఆ కూరను అక్కడ బందీలుగా ఉన్న వారికి వడ్డించేవారట. ఈ విషయాన్ని ఐసిస్(ISIS) చేతిలో బందీగా మారి 10 ఏళ్లు నరకయాతన అనుభవించిన ఓ మహిళ చెప్పింది. ఐసిస్ అపహరించిన ఫౌజియా అమీన్ సిడో అనే మహిళను లెబనాన్‌లో గుర్తించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆమెను రక్షించి కుటుంబానికి అప్పగించింది. ఆమె పదేళ్ల పాటు ఐసిస్‌ చేతిలో బందీగా ఉంది. ఇటీవలే ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఐసిస్‌లో తాను ఎదుర్కొన్న భయంకర అనుభవాలను వెల్లడించింది. 2014లో 200 మంది మహిళలు, పిల్లలను బానిసలుగా చేసుకుందని.. వారిలోనే తానూ, తన సోదరులు ఉన్నట్లు చెప్పింది. అప్పుడు ఆమె వయస్సు 9 ఏళ్లు.

ISIS Terrorists Kills..

‘‘టెర్రరిస్టులు మమ్మల్ని బంధించిన అనంతరం మూడు రోజుల పాటు ఆహారం పెట్టలేదు. తర్వాత మాకు అన్నం, మాంసం పెట్టారు. మాంసాహారం తింటున్న సమయంలో దుర్వాసన వచ్చింది. ఆహారం తిన్న వెంటనే అనారోగ్యం బారిన పడ్డాం. ఆ మాంసం జంతువుది కాదని చెప్పడంతో షాక్‌కి గురయ్యాం. యజిదీ శిశువులను చంపి కూర వండి మాకు వడ్డించారు. చిన్నారులను చంపి.. వండుతున్నప్పుడు తీసిన ఫొటోలను చూపించారు. మా పిల్లలను మేమే తిన్నామనే ఆలోచన మమ్మల్ని నిలువునా దహించివేసింది. ఓ మహిళ కనిపించకుండా పోయిన తన బిడ్డలను గుర్తు చేసుకొని క్షణాల్లోనే ప్రాణాలు విడిచింది’’ అని ఫౌజియా మీడియాతో చెప్పారు. బాధితురాలు చిన్నారులు పడిన బాధల గురించి వివరించింది. ఉగ్రవాదులు తమను భూగర్భ జైలులో తొమ్మిది నెలల పాటు బందీగా ఉంచారని తెలిపింది. కలుషిత తాగునీరు ఇవ్వడంతో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. తరువాత తన పేరును సబయాగా మార్చి జిహాదీలకు విక్రయించారని తెలిపింది. ఐసిస్(ISIS) చేతిలో ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు బందీలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ వారు అరబ్‌ ముస్లింలుగా పెరుగుతున్నారని చెప్పింది.

Also Read : Shrikant Shinde : మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉజ్జయిని గర్భ గుడిలో పూజ పై విమర్శలు

Leave A Reply

Your Email Id will not be published!