PM Narendra Modi: ప్రధాని మోదీ ఇంటిపై దాడికి పిలుపునిచ్చిన వ్యక్తి అరెస్ట్‌

ప్రధాని మోదీ ఇంటిపై దాడికి పిలుపునిచ్చిన వ్యక్తి అరెస్ట్‌

PM Narendra Modi : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో…. ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడి చేయాలని పాకిస్తాన్ కు పిలుపునిస్తూ ఆ యువకుడు సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారడంతో బెంగుళూరు బండెపాళ్య పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

PM Narendra Modi House

కర్ణాటకలోని మంగనమ్మనపాళ్యకు చెందిన నవాజ్‌… ఇటీవల పాకిస్తాన్‌‌ తో యుద్ధం సమయంలో ప్రధాని మోదీ(PM Narendra Modi) గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు. దీనిని పబ్లిక్‌ సర్వేంట్‌ పేరుతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. నవాజ్‌ వీడియోలో మాట్లాడుతూ… ‘పాకిస్తాన్‌పై బాంబు దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ(PM Narendra Modi) ఇంటిపై పాకిస్తాన్‌ ఎందుకు బాంబులు వేయడం లేదు. బాంబు దాడికి నేను పిలుపునిస్తున్నా. బాంబు దాడి చేయాలనుకుంటున్నా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో గురించి తెలిసి పోలీసులు… అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. నిందితుడిని గుర్తించి నిర్బంధించారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ (తూర్పు) రమేష్ బానోత్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన నవాజ్ కంప్యూటర్ మెకానిక్‌ గా పనిచేస్తున్నాడు. రెచ్చగొట్టే కంటెంట్ ఉన్నందుకు అతడిని అరెస్ట్‌ చేయడం జరిగింది. బండేపాళ్య పోలీసులు అతన్ని అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు రిమాండ్ చేశారు. అతనిపై తుమకూరులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కేసు పెండింగ్‌లో ఉందని తేలింది. ఈ పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశ్యంపై పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నవాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ హైకమిషన్‌ అధికారిపై బహిష్కరణ

గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగంపై ఢిల్లీలోని పాకిస్తాన్‌(Pakistan) హై కమిషన్‌ కార్యాలయంలో పనిచేస్తోన్న ఆ దేశ అధికారి ఒకరిని భారత్‌ మంగళవారం బహిష్కరించింది. పంజాబ్‌ పోలీసులు విచారిస్తోన్న ఓ గూఢచర్యం కేసుకు సంబంధించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన్ని అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్‌గ్రేటా)గా ప్రకటించి 24 గంటల్లోగా మన దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది.

ఈ అధికారి నిర్వాకంపై ఢిల్లీలోని పాకిస్థానీ షాజేడఫైర్‌కి నిరసన లేఖ ఇచ్చింది. ఇరుదేశాల మధ్య కొద్దిరోజులుగా సైనికపరమైన ఉద్రిక్తత తలెత్తి, సద్దుమణిగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పాక్‌ అధికారిపై అభియోగాలు ఎలాంటివనేది విదేశీ వ్యవహారాల శాఖ నిర్దిష్టంగా వెల్లడించలేదు. మరోవైపు, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ అధికారిని అవాంఛిత వ్యక్తిగా పాకిస్థాన్‌ ప్రకటించింది. 24 గంటల్లోగా దేశం వీడివెళ్లిపోవాలని ఆయనను ఆదేశించింది. పంజాబ్‌ పోలీసులు ఆదివారం గూఢచర్యం ఆరోపణలపై ఒక మహిళ, మరో పురుషుడిని అరెస్టు చేశారు. వీరికి పాక్‌ హై కమిషన్‌ కార్యాలయంలోని ఆ అధికారితో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. భారత సైన్యం కదలికలపై వీరు పాక్‌కు సమాచారం చేరవేస్తున్నట్లు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ వెల్లడించారు.

Also Read : Supreme Court: రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కు సుప్రీం ఆదేశాలు

Leave A Reply

Your Email Id will not be published!