MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
MLC Kavitha : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఊరట దక్కింది. కవిత విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఆమె ఇంట్లోనే మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో భాగంగా ఐదు నెలల జైలు శిక్ష అనంతరం కవితకు షరతులమీద బెయిల్ మంజూరైంది. ఆ సమయంలో కవిత తన పాస్‌పోర్టును రౌస్ అవెన్యూ కోర్టులో అందించారు.
MLC Kavitha Gor Permission
తాజాగా, గ్రాడ్యుయేషన్ నిమిత్తం తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగా తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ కవిత… రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం పాస్‌పోర్టును విడుదల చేసింది. దీనితో కవిత ఇవాళ అమెరికాకు వెళ్లనున్నారు. 15రోజుల పర్యటన అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
ఇక అమెరికా పర్యటనకు ముందు కవిత… తన తండ్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు కవితతో పాటు చిన్న కుమారుడు ఆర్య సైతం వెళ్లారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం, శనివారం ఉదయం అమెరికాకు బయల్దేరనున్నారు.
బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం
బీఆర్ఎస్ కీలక నేతలు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు క్యూకడుతున్నారు. కేటీఆర్, హరీశ్ సహా ముఖ్య నేతలుఎర్రవల్లి ఫాంహౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు ఈ సమావేశంలో కీలక భూమిక పోషించే అవకాశం కనిపిస్తోంది. అటు అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం రిపోర్ట్ తదితర పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక, ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం మీద ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Also Read : CM Revanth Reddy: ప్రపంచ నగరాలతో పోటీపడుతూ ముందుకువెళ్తున్నాం – సీఎం రేవంత్ రెడ్డి
