Sajjala Ramakrishna Reddy: అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకోండి – పార్టీ కార్యదర్శులతో సజ్జల

అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకోండి - పార్టీ కార్యదర్శులతో సజ్జల

Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్‌సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని… ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో ఆయన అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.మనోహర్‌ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్‌ లాంటి వారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నిలబడాలి.. వైఎస్సార్‌సీపీది ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పేర్కొన్నారు. ‘‘మనమంతా బలమైన వ్యవస్ధగా రూపొందాం. మీరంతా మీ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే అవకాశం మీకు పార్టీలో కల్పించబడింది. దానిని ఛాలెంజ్‌గా తీసుకుని మీరు నిలబడాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతుకగా మనం నిలబడాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు.

Sajjala Ramakrishna Reddy – చతేశ్వర్ పుజారా రిటైర్‌మెంట్‌పై వైఎస్ జగన్ ట్వీట్

క్రికెటర్ చతేశ్వర్ పుజారా రిటైర్‌మెంట్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. పుజారా భవిష్యత్ బాగుండాలని.. మెరుగైన విజయాలు సాధించాలన్నారు. పుజారా క్రమశిక్షణ, ఆటతీరు దేశానికి మరింత గౌరవాన్ని పెంచాయని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

టీమిండియా దిగ్గజం చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. త‌న నిర్ణ‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయన వెల్ల‌డించాడు. టీమిండియా దిగ్గజం రాహుల్ ద్ర‌విడ్‌ వార‌సుడిగా పేరొందిన‌ ఛ‌తేశ్వ‌ర్ పుజారా.. అక్టోబర్ 9, 2010న భారత తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై త‌న టెస్టు అరంగేట్రం చేశాడు. త‌న కెరీర్‌లో 103 టెస్టులు ఆడిన పుజ‌రా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

Also Read : ISRO: గగన్‌యాన్‌ మిషన్‌ లో భాగంగా ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ విజయవంతం

Leave A Reply

Your Email Id will not be published!