Goa Governor: రుషికొండ ప్యాలెస్ ను మానసిక వైద్యశాలగా మార్చాలి – గోవా గవర్నర్
రుషికొండ ప్యాలెస్ ను మానసిక వైద్యశాలగా మార్చాలి - గోవా గవర్నర్
Goa Governor : ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను మానసిక వైద్యశాఖ (పిచ్చి ఆసుపత్రి)గా మార్చాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతి రాజు (Goa Governor) సలహా ఇచ్చారు. క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం విశాఖలో ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు (Goa Governor) మాట్లాడుతూ… ‘‘అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం… ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. చాలా ఏళ్లు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను. అప్పుడు సంక్షేమం కోసం అప్పులు చేసేవారు. కానీ, గత ప్రభుత్వంలో అన్ని తాకట్టులో పెట్టడం చూశా. విశాఖలో ప్రజాధనంతో కట్టిన రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని తెలిసింది. అదే రూ.600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేది. ఈ ప్యాలెస్‌ను ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది. దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని నా ఉచిత సలహా. కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదు. ప్రజాధనాన్ని ప్రజా హితం కోసం వాడాలి. మన అందరినీ ఇబ్బంది పెట్టారు. మనో ధైర్యంతో నిలబడాలి… లొంగిపోకూడదు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు వదిలిన వారికి మనమేం విలువ ఇస్తున్నామో ఆలోచించాలి. మన వీర సైనికులు ప్రపంచానికి మన సత్తా చూపించారు. అన్ని దేశాలకు ఒక పాఠం నేర్పించాం’’ అని అశోక్‌గజపతిరాజు అన్నారు.
Goa Governor – కైలాసగిరిపై సిద్ధమైన దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన
విశాఖలో మరికొద్ది రోజుల్లో గాజు వంతెన పర్యాటకులకు థ్రిల్ పంచనుంది. మహా విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. ఇది దేశంలోనే అతి పొడవైనది. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో దీనిని నిర్మించినా… భద్రత దృష్ట్యా ఒకసారికి కేవలం 40 మందికి మాత్రమే అనుమతిస్తారు. దీనిపైకి ఎక్కిచూస్తే చుట్టూ ఎత్తయిన కొండలు, కింది భాగంలో లోయ, కనుచూపు మేరలో సాగరం కనిపిస్తాయి. గాల్లో తేలియాడుతున్నట్లు, కొత్త లోకంలో విహరిస్తున్న భావన పర్యాటకులకు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
Also Read : CM Chandrababu: వైసీపీ దుష్ప్రచారంపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు
