Telangana Government: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా ?

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా ?

Telangana Government : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. దీనితో పంచాయతీ, పరిషత్ ఎన్నికలు మరింత ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈనెల 30లోపు బిల్లులు ఎటూ తేలకపోతే… హైకోర్టును ఆశ్రయించి ఎన్నికలకు మరింత గడువు కోరే యోచనలో ప్రభుత్వం ఉంది.

బిహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) భావిస్తోందట. ఇందుకోసం హైకోర్టును రెండు నుంచి మూడు నెలల గడువు అడిగాలని చూస్తోందట. కాగా, ఆగస్టు 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ భేటీ అయింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది.

Telangana Government – దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు దసరా సెలవులను ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అదే విధంగా జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణలో దసరా పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. దేవీ నవరాత్రుల కోసం హైదరాబాద్ నగరంలోని పలు వీధుల్లో అమ్మవారి విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తారు. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. బతుకమ్మ ఆట,పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక, ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ప్రాంతాలను బట్టి పండుగ జరుపుకునే తేదీలో తేడా ఉంటుంది.

Also Read : CM Revanth Reddy: నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన – సీఎం రేవంత్‌రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!