Senthil Balaji: డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
Senthil Balaji : డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. క్యాష్ ఫర్ లాండ్ కుంభకోణం కేసు పెండింగ్‌లో ఉన్నందున తనను తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవాలా వద్దా అనే విషయంలో గత ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిష్ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. మంత్రి పదవి గురించిన ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో లేనే లేదని స్పష్టం చేసింది. ‘మేం ఆ ఉత్తర్వును మళ్లీ చదవం. మీరు మంత్రిగా మారడానికి దానిని మేం చదవలేం. అయితే, మీరు మంత్రి పదవిని చేపట్టినా లేదా మరే ఇతర అధికార పదవిని నిర్వహించినా రాష్ట్ర వాతావరణం ప్రభావితమైతే, న్యాయం జరిగేలా అప్పుడే చూస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది.
మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని (Senthil Balaji) పదవికి రాజీనామా చేయాలంటూ ఇచ్చిన తీర్పుపై మళ్లీ స్పష్టత కోరడమెందుకంటూ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌ను ప్రశ్నించింది. బెయిల్ వచ్చిన కొన్ని రోజుల్లోనే తిరిగి మంత్రి పదవిని చేపట్టిన సెంథిల్ బాలాజీ, కేసుల విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నందునే జైలుకు వెళ్లడం మంచిదంటూ అప్పటి ధర్మాసనం వ్యాఖ్యానించి ఉంటుందని పేర్కొంది.
Senthil Balaji – కరూర్ దుర్ఘటనకు నిర్వాహకులే బాధ్యులు – కమల్‌హాసన్
కరూర్ తొక్కిసలాటలో 41మంది చనిపోవడం వెనక ప్రతి ఒక్కరూ బాధ్యులేనని, ప్రత్యేకంగా నిర్వాహకులే బాధ్యత వహించాలని ఎంఎన్‌ఎం అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ అన్నారు. కరూర్ లో ఘటనాస్థలిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తమిళగ వెట్రి కళగం(టీవీకే) సభలో తప్పు జరిగిందని, దానిని ఒప్పుకొని బాధితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాన్ని కప్పిపుచ్చుకొనేలా ఇతరులపై నిందలు వేయడం సరికాదన్నారు. అంతకుముందు ఆయన బాధిత కుటుంబాల్ని పరామర్శించారు.
Also Read : IRCTC: ఇకపై ఆధార్ ఉంటేనే ట్రైన్ టికెట్
