Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్
నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్
Fake Liquor Case : నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్రావు (Janardhan Rao) సంచలన విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేశ్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని పేర్కొన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో తయారీ ఆపేసినట్లు వివరించాడు. ‘‘ఏప్రిల్లో జోగి రమేశ్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు సహకరించాలని కోరారు. నకిలీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నాం. రమేశ్ ఆదేశాలతో తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించాం. తంబళ్లపల్లి అయితే చంద్రబాబుపై బురద జల్లోచ్చని చెప్పారు. ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Fake Liquor Case Update
నన్ను కావాలనే ఆఫ్రికాలోని నా మిత్రుడి వద్దకు పంపారు. జోగి రమేశ్ తన మనుషులతో లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. టీడీపీ వారిని చంద్రబాబు సస్పెండ్ చేయడంతో ప్లాన్ మార్చారు. ఇబ్రహీంపట్నంలోనూ సరకు తెచ్చి పెట్టాలన్నారు. ఇబ్రహీంపట్నం గోదాములో ముందురోజే సరకు తెచ్చిపెట్టారు. మళ్లీ లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు. పథకం ప్రకారం చంద్రబాబు సర్కారుకు చెడ్డపేరు వచ్చిందని రమేశ్ చెప్పారు. అనుకున్నట్టే అంతా జరిగింది… నువ్వు ఆఫ్రికా నుంచి రావొద్దని చెప్పారు. అంతా నేను చూసుకుంటా… బెయిలిప్పిస్తా అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత హ్యాండిచ్చారు. నా తమ్ముడిని కూడా ఇరికించారు. జయచంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదని జోగి రమేశ్ నమ్మించారు. జయచంద్రారెడ్డికి… నకిలీ మద్యం తయారీకి సంబంధం లేదు. రమేశ్ తో చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. నమ్మించి మోసం చేశారు. అందుకే బయటకు వచ్చి నిజం చెబుతున్నా’’ అని జనార్దన్రావు తెలిపాడు.
Also Read : Minister Nadendla Manohar: అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్టకు మూడు చెక్ పోస్టులు – నాదెండ్ల మనోహర్
