ఢిల్లీ : ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో స్వంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ కు కోలుకోలేని రీతిలో షాక్ తగిలింది. ఇక స్టార్టింగ్ లో పరాజయం పాలైనా , అడపా దడపా మ్యాచ్ లు గెలుస్తూ వస్తోంది సీఎస్కే. ప్రధానంగా భారీ ధరకు తీసుకున్న కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ మరోసారి తన స్టామినా ఏమిటో చూపించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ తాను తీసుకున్న నిర్ణయం తప్పని తేలి పోయింది. ఈ గెలుపుతో చెన్నై ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు గెలిచింది. ఇంకా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఇదే ఫామ్ ను శాంసన్ కొనసాగిస్తే ఇతర జట్లకు పరాజయం ఖాయమని చెప్పక తప్పదు.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 155 రన్స్ చేసింది. 7 వికెట్లు కోల్పోయింది. సమీర్ రిజ్వీ 24 బంతుల్లో 4 సిక్సర్లతో 40 నాటౌట్ గా నిలిచాడు స్టబ్స్ 31 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 2 సిక్సర్లు ఉన్నాయి. 38 రన్స్ చేశాడు. అనంతరం మైదానంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 17.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రధానంగా స్టార్ హిట్టర్ సంజు శాంసన్ కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. తను కేవలం 52 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. తనకు తోడుగా కార్తీక్ శర్మ సూపర్ షో చేశాడు. తను 31 బంతులు ఆడి 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.
