ఎంఎస్ ధోనీ వ‌ల్ల‌నే ఈ స్థాయిలో ఉన్నా : రోహిత్ శ‌ర్మ

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన భార‌త క్రికెటర్

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఓ ఛాన‌ల్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్భంగా ఇండియ‌న్ లెజెండ్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ గురించి ప్ర‌స్తావించాడు. ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగానంటే, దానికి ప్రధాన కారణం MS ధోనీ భాయ్ అని చెప్పాలి. ఒకవేళ ఆయన లేకపోతే, బహుశా నా కెరీర్‌లో నేను ఈ దశకు చేరుకునేవాడిని కాదేమో అని అన్నాడు. ఒకానొక స‌మ‌యంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు రోహిత్ శ‌ర్మ‌. ఛాంపియన్స్ ట్రోఫీలో నన్ను ఓపెనింగ్ బ్యాటింగ్ చేయమని ప్రోత్సహించారని తెలిపాడు.

అదే నా జీవితంలో ఒక కీలక మలుపుగా మారిందని చెప్పాడు క్రికెట‌ర్. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. ధోనీ నాకు అందించిన మద్దతు, అండగా నిలిచిన తీరు అద్భుతం అని కొనియాడాడు. ఒకవేళ ఆయన నా కెప్టెన్‌గా లేకపోయి ఉంటే, పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవ‌ని పేర్కొన్నాడు. ధోనీ భాయ్ నా కెప్టెన్‌గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. నా జీవితాంతం MS ధోనీ భాయ్‌కి కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నాడు. MS ధోనీ ఒక గొప్ప ఆటగాడు , గొప్ప కెప్టెన్. ఐ లవ్ యూ, భాయ్ అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండ‌గా రోహిత్ శ‌ర్మ భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. కెప్టెన్ గా, ఆట‌గాడిగా ఎన్నో విజ‌యాల‌లో పాలు పంచుకున్నాడు. త‌న‌దైన రీతిలో ముద్ర క‌న‌బ‌రిచాడు. ప‌లు క‌ప్పులు భార‌త్ కైవ‌సం చేసుకోవ‌డంలో కూడా కీల‌క పాత్ర పోషించాడు.

Leave A Reply

Your Email Id will not be published!