హైదరాబాద్ : అభిజిత్ దీప్కే సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ భారత దేశంలో సంచలనంగా మారింది. పూర్తి పారదర్శక పాలన రావాలని, అవినీతి రహిత దేశంగా మారాలని, లీకులు లేని పరీక్షలు ఉండాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇప్పటికే ఇండియాలో నీట్ – యుజి 2026 పరీక్షతో పాటు సీబీఎస్ఈ పరీక్షలు లీకుల పాలయ్యాయి. ఈనెల 21న తిరిగి నీట్ – యుజీ పరీక్ష నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). దీనిపై విచారణకు ఆదేశించింది కేంద్రం. పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి దేశమంతటా. ఈ తరుణంలో ఉన్నట్టుండి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చారు ఆన్ లైన్ వేదికగా పార్టీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
బారీ ఎత్తున యువతీ యువకులతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రజాస్వామిక వాదులు, పర్యావరణ ప్రేమికులు, జర్నలిస్టులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ బేషరతు మద్దతు ప్రకటించారు. ఇదే క్రమంలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా దేశంలోని రెండు చోట్ల ఈనెల 14న సోమవారం బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో రెండు చోట్ల ఆందోళనకు పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ సందర్బంగా బెంగళూరులో జరిగే సీజేపీ ఆందోళన కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.
