కాంగ్రెస్ వైపు సంజ‌య్ రౌత్ చూపు..?

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శివ‌సేన

ముంబై : మ‌రాఠా ప్ర‌జ‌ల గొంతును వినిపిస్తున్న ఏకైక రాజ‌కీయ న‌టుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు శివ‌సేన పార్టీ (బాల్ థాక‌రే ) కి చెందిన సంజ‌య్ రౌత్ సంచ‌ల‌నంగా మారారు. ప్ర‌స్తుతం కింది స్థాయి వ‌ర‌కు పేరుకు పోయి విల‌క్ష‌ణ రాజ‌కీయాల‌కు, వెన్ను పోట్ల‌కు తెర తీసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. దీనిని ఎదుర్కొనేందుకు వివిధ ప్రాంతీయ‌, జాతీయ పార్టీల‌తో క‌లిసి ఇప్ప‌టికే ఇండియా కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో కీల‌క‌మైన స‌మావేశం జ‌రిగింది. ఈ కీల‌క మీటింగ్ లో ఆయా పార్టీల‌న్నీ కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ప‌శ్చిమ బెంగాల్ లో ఇటీవ‌ల జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలైంది టీఎంసీ.

దీంతో ఆ పార్టీలో చీలిక‌లు ప్రారంభం అయ్యాయి. ఎంపీలు కూడా పార్టీ చీఫ్ , మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై తిరుగుబాటు జెండా ప్ర‌క‌టించారు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో ఇండియా కూట‌మి త‌ర‌పున బ‌ల‌మైన గొంతుక‌గా ఉంటూ వ‌చ్చిన మరాఠా కు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ప్ర‌స్తుతం శివ‌సేన బాల్ థాక్రే పార్టీలో స్పోక్స్ ప‌ర్స‌న్ గా ఉన్నారు. ఆయ‌న కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

తమ పార్టీలో రౌత్‌కు ఇకపై తగిన గుర్తింపు లేదు. భవిష్యత్తులో ఆయనకు రాజ్యసభ నామినేషన్ లభిస్తుందనే నమ్మకం లేదు, అందుకే ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు అని వాఘ్మరే పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నాయకులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. రౌత్‌కు మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు తగ్గి పోయాయని, అందుకే ఆయన కాంగ్రెస్‌తో సంబంధాలను బలపరుచు కుంటున్నారని శివసేన ఎంపీ జ్యోతి వాఘ్మరే ఆరోపించారు.

Leave A Reply

Your Email Id will not be published!