ఇరాన్ తో అమెరికా కీల‌క ఒప్పందం

యుద్దం నుంచి తాత్కాలిక విరామం

అమెరికా : యుద్దానికి తాత్కాలిక విరామం ఏర్ప‌డింది. అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న 80వ పుట్టిన రోజును ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్బంగా తాత్కాలికంగా ఇరాన్ పై దాడుల‌కు దిగ‌బోమంటూ ప్ర‌క‌టించారు. ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన కీల‌క ఒప్పందంతో మ‌ధ్య ప్రాచ్యంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు సంతోషం వ్య‌క్తం చేశాయి. ఇదిలా ఉండ‌గా స్వాతంత్ర ప్రకటనపై సంతకం చేసి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న సుదీర్ఘ వేడుకలతో ఈ కార్యక్రమాన్ని అనుసంధానించాలని అధ్యక్షుడు భావించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , యుఎఫ్‌సీ చీఫ్‌, సీఈఓ డానా వైట్ హౌస్ సౌత్ లాన్ లో యుఎఫ్‌సీ ఫ్రీడం 250 కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వ‌హించారు. డొనాల్డ్ ట్రంప్ త‌న పుట్టిన రోజును యుద్దాన్ని ముగించే ప్రాథ‌మిక ఒప్పందాన్ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

వైట్ హౌస్ చారిత్రాత్మక సౌత్ లాన్‌లో గతంలో ఊహించని స్థాయిలోని ‘కేజ్-ఫైటింగ్’ ప్రదర్శనను నిర్వహించడం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. కాగా ఈ ఒప్పందం గురించి ట్రంప్ గత కొన్ని వారాలుగా ప్రచారం చేస్తున్నారు. అయితే సంఘర్షణలో చివరి నిమిషంలో జరిగిన దాడులు, ఈ భారీ UFC మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనపై నీలినీడలు కమ్మేలా చేశాయి . పోరాటం ప్రారంభానికి కొన్ని గంటల ముందు, సంఘర్షణను ముగించే ఒప్పందం పూర్తయిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇరాన్‌పై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుందని, హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని ఆయన ప్రకటించారు. దీనివల్ల చమురు ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. అస్థిరంగా ఉన్న ప్రపంచ మార్కెట్లు కుదుటపడే అవకాశం ఉంది.

Leave A Reply

Your Email Id will not be published!