జూలై 10న అఖిల్ , భాగ్య‌శ్రీ బోర్సే లెనిన్ రిలీజ్

అదికారికంగా కీల‌క ప్ర‌క‌టన చేసిన‌ మూవీ మేక‌ర్స్

హైద‌రాబాద్ : అక్కినేని అభిమానుల‌కు తీపి క‌బురు చెప్పారు అఖిల్ అక్కినేని. త‌నతో పాటు ల‌వ్లీ బ్యూటీ భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి న‌టించిన చిత్రం లెనిన్. ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌ను అంత‌కు ముందు పూజా హెగ్డేతో క‌లిసి బ్యాచిల‌ర్ సినిమాలో న‌టించాడు. ప్రస్తుతం లెనిన్ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. మూవీ మేక‌ర్స్ తాజాగా కీల‌క అప్ డేట్ ఇచ్చారు. జూలై 10వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా లెనిన్ ను విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. అఖిల్ , భాగ్య‌శ్రీ బోర్సేల న‌ట‌న పీక్ కు చేరింది.

ఇక ద‌ర్వ‌కుడు లెనిన్ చిత్రాన్ని భిన్నంగా చిత్రీక‌రించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. అఖిల్ అక్కినేని ప్రేమను ఒక భయంకరమైన గ్రామ యుద్ధంగా మార్చాడు. లెనిన్ , భారతిల మధ్య ప్రేమకథను చూపిస్తుంది, ఇది ఒక హింసాత్మక గ్రామ ఘర్షణకు దారితీస్తుంది. ముందుగా నిర్ణయించిన తేదీ నుండి వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు 10న థియేటర్లలోకి రానుంది. నాగార్జున ఒక కొత్త అఖిల్‌ను పరిచయం చేస్తానని హామీ ఇస్తున్నారు. ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు అని ఓ ట్యాగ్ లైన్ కూడా లెనిన్ కోసం జ‌త చేర్చాడు ద‌ర్శ‌కుడు.

మురళీ కిషోర్ అబ్బూరు రచన, దర్శకత్వం వహించిన ‘లెనిన్’ చిత్రంలో శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు ,సునీల్ కూడా నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ , లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. 2023లో విడుదలైన ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ ఈ చిత్రంతో తిరిగి థియేటర్లలోకి వస్తున్నాడు.

Leave A Reply

Your Email Id will not be published!