116 ఏళ్ల నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : చైర్మన్
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన వృద్దురాలు
తిరుమల : కలియుగ దైవం అయిన , కోట్లాది మంది మంది భక్త బాంధవులను కలిగిన ఏకైక దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. చని పోయే లోపు ఒక్కసారైనా శ్రీవారిని దర్శించు కోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఈ సందర్భంగా సంచలనంగా మారారు 116 ఏళ్ల వయసు కలిగిన వృద్దురాలు. దీంతో దేశ వ్యాప్తంగా వైరల్ గా మారారు సదరు భక్తురాలు. వృద్దురాలి పాదయాత్రపై స్పందించారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ ) చైర్మన్ బీఆర్ నాయుడు. ఆదివారం కీలక ప్రకటన చేశారు. సదరు వృద్ద భక్తురాలిని అభినందించారు. అంతే కాకుండా టీటీడీ తరపున ఆమెకు వీఐపీ దర్శన భాగ్యం కల్పిస్తామని వెల్లడించారు.
ఆ భక్తురాలి పేరు నవనీతమ్మ . తన భక్తికి నెట్టింట ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. ఆమె కుటుంబానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తామన్నారు బీఆర్ నాయుడు. తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె భక్తిని గుర్తించిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ‘X’ (ట్విట్టర్) వేదికగా వైరల్ అయిన ఆమె పాదయాత్ర వీడియోపై స్పందించారు టీటీడీ చైర్మన్.
ఇంతటి వయసులోనూ ఆమె ప్రదర్శించిన అచంచలమైన భక్తి నిజంగా స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. ఆమె దర్శనానికి ఏర్పాట్లు చేసే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమె ఆరోగ్యం , దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించారు. నవనీతమ్మ శనివారం అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. మొదట్లో ఆమె వివరాలు స్పష్టంగా తెలియలేదు, కొందరు ఆమె కర్ణాటకకు చెంది నవారని భావించారు. అయితే, చైర్మన్ వివరాలు కోరడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆమె నేపథ్యాన్ని ఆరా తీశారు. ఆమె తమిళనాడుకు చెందినవా రని, ప్రస్తుతం తిరుపతిలోని జీవకోణలో బంధువుల వద్ద ఉంటున్నారని నిర్ధారించారు. దీనిని అనుసరించి, సోమవారం ఉదయం నవనీతమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు.
