చెన్నై : డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పదే పదే ఈ మధ్యన సీఎంగా కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను విమర్శిస్తూ వస్తున్నారు. ఇవాళ ఉదయనిధి మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే డీఎంకే ఏఐడీఎంకే పార్టీతో కలిసి తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని, కుట్రలకు తెర లేపారంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఇది తనకు , ఆయన పార్టీ నేతలకు మంచి పద్దతి కాదన్నారు. తుమ్మితే ఊడి పోయే టీవీకే కూటమి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు ఉదయనిధి స్టాలిన్.
ప్రజలను తమ వైపు తిప్పు కోవడానికి ఇలాంటి చవకబారు ప్రకటనలు చేస్తూ వస్తున్నారని, ఇది సీఎం విజయ్ కు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేశారు . ఇదే క్రమంలో తమ పార్టీ డీఎంకే ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తోందని కూడా వారు చెబుతున్నారు. మేము ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోయాలి? ప్రజలే దానిని తొలగిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉదయనిధి స్టాలిన్. ఆయన మమ్మల్ని ‘దుష్ట శక్తి’ అని, ‘అవినీతి శక్తి’ అని, ఇంకా అనేక పేర్లతో సంబోధించారు. చివరికి మా పేరును ప్రస్తావించడానికి కూడా ఆయన సంకోచించారంటూ పేర్కొన్నారు. ఎవరు పేదలకు గత కొన్నేళ్లుగా మేలు చేశారనేది చేపట్టిన పనులు చూస్తే తెలుస్తుందన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై టీవీకే మంత్రులు సీరియస్ గా స్పందించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
