నోరి ల‌క్ష్మి భాస్క‌ర్ అక్ర‌మాస్తులు రూ. 50 కోట్లు

నిమ్స్ లో అదనపు మెడికల్ సూపరింటెండెంట్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మార్కుల బండారం బ‌య‌ట ప‌డుతోంది. రోజు రోజుకు కోట్లాది రూపాయ‌లు క‌లిగిన వాళ్లు మెల మెల్ల‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. కోట్ల‌ల్లో ఉంటున్నాయి వారి ఆస్తులు. క‌ళ్లు బైర్లు క‌మ్మేలా అందినంత మేర దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మి భాస్కర్‌పై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారు .తన ఉద్యోగ కాలంలో అవినీతి పద్ధతులు, అక్రమ మార్గాల ద్వారా తన తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇది ‘అవినీతి నిరోధక చట్టం, 1988’ (2018 సవరణతో సహా)లోని సెక్షన్లు 13(1)(b) , 13(2) ప్రకారం శిక్షార్హమైన నేరం కావడంతో నిన్న‌ ఆయన నివాసంలోనూ, అలాగే ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు ,ఇతర సన్నిహితులకు చెందిన ఏడు ఇతర ప్రదేశాలలోనూ సోదాలు నిర్వహించారు.

ఈ సోదాలలో… ఒక హై-రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో 4-బెడ్‌రూమ్ ఫ్లాట్, కూకట్‌పల్లిలోని హై-రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో రెండు 3-బెడ్‌రూమ్ ఫ్లాట్లు, మాణికొండ-పేట్‌బషీరాబాద్-కూకట్‌పల్లి ప్రాంతాలలో ఐదు 2-బెడ్‌రూమ్ ఫ్లాట్లు, యాదాద్రి-నందిగామ-షమీర్‌పేట్ ప్రాంతాలలో నాలుగు ఖాళీ స్థలాలు (ప్లాట్లు) ఉన్న‌ట్లు గుర్తించారు. వీటితో పాటు విశాఖపట్నం నగరంలో 800 చదరపు గజాల ఖాళీ స్థలం, రూ. 41,00,000 బ్యాంక్ నిల్వలు, రూ. 12,00,000 పోస్టాఫీసు డిపాజిట్లు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలలో రూ. 35,00,000 పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 29,55,000 పెట్టుబడులు, సుమారు 517.8 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు, నాలుగు చక్రాల వాహనాలు (ఒక జాగ్వార్, ఒక ఆడి, ఒక టాటా నెక్సాన్), నాలుగు ద్విచక్ర వాహనాలు (రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా) ఉన్న‌ట్టు గుర్తించారు.

రూ. 5,00,000 విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన పత్రాలు/ఆస్తులు గుర్తించారు. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ. 6,13,00,000. చరాస్తులు, స్థిరాస్తుల మార్కెట్ విలువ, వాటి డాక్యుమెంట్ విలువ కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. అంతే కాకుండా, DRT (డెట్ రికవరీ ట్రిబ్యునల్) వద్ద వివాదంలో ఉన్న ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేయడానికి ఆయన రూ. 1,30,00,000/- పెట్టుబడి పెట్టినట్లు వెల్ల‌డించింది ఏసీబీ. అలాగే, వివిధ వ్యక్తులకు చేతి అప్పుల (hand loans) రూపంలో మరో రూ. 1,33,00,000/- ఇచ్చారని వెల్ల‌డించింది . మొత్తంగా ల‌క్ష్మీ భాస్క‌ర్ అక్ర‌మ ఆస్తుల విలువ దాదాపు రూ. 50 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా.

Leave A Reply

Your Email Id will not be published!