నాకు ఇప్ప‌టికింకా పెళ్లి కాలేదు : డింపుల్ హ‌యతి

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన యువ న‌టి

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి డింపుల్ హ‌యతి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌ను సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం భోగిలో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది. త‌న‌తో పాటు ఇందులో యువ కథానాయకుడు శర్వానంద్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. గ్రామీణ నేప‌థ్యంతో సాగుతోంది ఈ మూవీ. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు అత్యంత జ‌నాద‌ర‌ణ పొందాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా డింపుల్ హ‌య‌తి నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో శర్వానంద్‌తో కలిసి నటిస్తున్న గ్లామరస్ బ్యూటీ డింపుల్ హయాతి ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన ఉత్సాహ భరితమైన ఉనికితో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె, సినిమాపై అంచనాలను మరింత పెంచారు.

అయితే, ఈవెంట్ వేదికపై శర్వానంద్‌తో మాట్లాడుతున్నప్పుడు డింపుల్ హయాతి కొంచెం ఆయన వైపు వంగినట్లుగా ఉన్న ఒక దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఒక మీమ్ పేజీలో ఈ వీడియో షేర్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వెల్లువెత్తాయి. ఒక నెటిజన్, “శర్వానంద్ లాగే డింపుల్ హయాతికి కూడా పెళ్లయి పోయిందా?” అని ప్రశ్నించారు. దీనికి డింపుల్ హయాతి ఎంతో సరదాగా, ప్రశాంతంగా స్పందించారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని , ఇంకా వ‌ర్జిన్ అంటూ ఆమె ఇచ్చిన చమత్కారమైన సమాధానం ఇప్పుడు ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శర్వానంద్ , డింపుల్ మధ్య జరిగిన ఆ సన్నివేశం కేవలం స్నేహ పూర్వకమైనదేనని, దానిని మరేదో రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమైంది. మొత్తానికి, ‘భోగి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఈ వీడియో ,డింపుల్ హయాతి ఇచ్చిన ఆసక్తికరమైన సమాధానం సినిమాకు మంచి ప్రచారాన్ని కల్పిస్తున్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!