అయ్యో రామా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇదేం ఖ‌ర్మ‌..?

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

తాడేప‌ల్లి గూడెం : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై. ఓ వైపు స‌నాత‌న ధ‌ర్మం అంటూ చిలుక ప‌లుకులు ప‌లుకుతూ మ‌రో వైపు ఆల‌యాల‌ను ధ్వంసం చేయ‌డం, బుల్డోజ‌ర్ల‌తో కూల్చి వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఇవాళ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న స‌ర్కార్ నిర్వాకాన్ని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్బంగా అయ్యో రామా ఏపీకి ఇదేం ఖ‌ర్మం అంటూ నిల‌దీశారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆల‌యాల‌ను కాపాడ‌డంలో, స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడ‌డంలో పూర్తిగా వైఫ‌ల్యం చెందారంటూ ధ్వ‌జ‌మెత్తారు జ‌గ‌న్ రెడ్డి.

చంద్రబాబు నాయుడు పాలన బ‌క్వాస్ అంటూ కొట్టి పారేశారు. ప్ర‌జ‌ల‌కే కాదు ఆల‌యాల‌కు కూడా రాష్ట్రంలో ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు. అంజనేయపురంలోని శతాబ్దాల నాటి అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇది త‌న‌ను ఎంతో వేదన‌కు గురి చేసింద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. తిరుమలలోని చారిత్రక వేయి స్తంభాల మండపాన్ని ధ్వంసం చేయడం దగ్గరి నుండి, కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 ఆలయాలను కూల్చడం, అలాగే బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో జరిగిన విధ్వంసం వరకు… ఇలా పవిత్ర కట్టడాలను ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించ కుండానే కూల్చివేస్తున్నారని ఆరోపించారు.

ఒకవైపు గ‌తంలో వైసీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం ‘శ్రీవాణి ట్రస్ట్’ ను ఏర్పాటు చేస్తే మరోవైపు చంద్రబాబు కూట‌మి పాలనలో వారసత్వ సంపదను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

Leave A Reply

Your Email Id will not be published!