ముంబై : బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ పై. ‘ఆషికీ 2’ చిత్రంలో తన కోసం పాట పాడిందని, ఆ అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొంది. తాజాగా ‘ఈథా’ చిత్రంలోని ‘జీ జీ రే జీ’ పాటకు కూడా శ్రేయానే తన స్వరాన్ని అందించారు. అంతే కాకుండా ఈ చిత్రం కోసం తాను చేసిన ‘లావణి’ నృత్య ప్రదర్శన గురించి కూడా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.సోమవారం ఒక పోస్ట్ చేస్తూ శ్రద్ధా 13 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పట్లో ‘ఆషికీ 2’ చిత్రంలో నా కోసం శ్రేయా పాట పాడారు.. ఆ సినిమా తన కెరీర్‌లోనే ఒక కీలక మలుపుగా నిలిచింది. శ్రద్ధా తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయాతో కలిసి ఉన్న ఒక అద్భుతమైన ఫోటోను పంచుకుంటూ ఇలా రాశారు: 13 ఏళ్ల క్రితం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ‘ఆషికీ 2’ చిత్రంలో ఆరోహి పాత్రకు గాత్రం అందించిన శ్రేయా ఘోషల్ ఇప్పుడు ‘జీ జీ రే జీ’ పాటకు కూడా పాడటం చాలా మాయా జాలంలా అనిపిస్తోంది అని పేర్కొన్నారు.
ఇంతకు ముందు ‘జీ జీ రే జీ’ పాటలో తాను చేసిన ‘లావణి’ నృత్య ప్రదర్శన గురించి కూడా శ్రద్ధా మాట్లాడారు. దీనిని ఒక ‘ఉత్సాహభరితమైన అనుభవం’గా పేర్కొన్న శ్రద్ధా ఈ సాంప్రదాయ నృత్య రూపాన్ని అన్వేషించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ‘జీ జీ రే జీ’ పాటలోని లయ, హావభావాలు , శక్తి ఈ ప్రదర్శనను మరింత ప్రత్యేకంగా మార్చాయని ఆమె తెలిపారు. ఈ పాట గురించి శ్రద్ధా మాట్లాడుతూ ఈ పాటకు నృత్యం చేయడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. లావణిలో ఏదో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. అందులోని లయ, హావభావాలు, శక్తి , ప్రేక్షకులతో ఏర్పడే అనుబంధం అద్భుతం. ఒక గొప్ప కళాకారిణి ప్రపంచంలోకి అడుగు పెట్టడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, అదే సమయంలో కొంత భయం కూడా కలిగేలా చేసిందని పేర్కొంది.
