న్యూఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసియా ఖండంలో అత్యంత సమర్థవంతమైన నాయకుడి గా గుర్తింపు పొందారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది 2026కు గాను అత్యంత సమర్థవంతమైన నాయకులలో ప్రధాని ఒకరు అని పేర్కొంది లోవీ ఇన్స్టిట్యూట్ . ఈ మేరకు తమ పరిశీలనలో ఆయనకు రెండో స్థానం దక్కిందని తెలిపింది. ఆసియా పవర్ ఇండెక్స్ ను వెల్లడించింది. ఇందులో భారత్ స్కోరు 40.5 పాయింట్లకు పెరగడంతో, ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తర్వాత, ఈ ప్రాంతంలో రెండో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిలిచారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పెరుగుతున్న ప్రాంతీయ ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ 2026లో భారత్ మొత్తం శక్తి స్కోరు 40.5 పాయింట్లకు పెరగడంతో, ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది . లోవీ ఇన్స్టిట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్ ప్రకారం ప్రధాన మంత్రి మోదీ ప్రాంతీయ నాయకత్వంపై అంచనాలు మెరుగు పడ్డాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తర్వాత ఆయన రెండో అత్యంత సమర్థవంతమైన ప్రాంతీయ నాయకుడిగా నిలిచారు.
దౌత్య ప్రభావం 70.3 పాయింట్ల స్కోరుతో భారతదేశానికి అత్యంత బలమైన కొలమానంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ ప్రాంతీయ నాయకత్వంపై అంచనాలు గణనీయంగా మెరుగు పడ్డాయని, ఆయన మూడు స్థానాలు పైకి ఎగబాకి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తర్వాత రెండవ అత్యంత సమర్థవంతమైన ప్రాంతీయ నాయకుడిగా నిలిచారని నివేదిక పేర్కొంది.
