ముంబై : వర్దమాన నటి మీనాక్షి శేషాద్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ లో సినిమా పరంగా ఎందుకు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చిందనే దానిపై చిట్ చాట్ సందర్బంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తను చేసిన తాజా కామెంట్స్ వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో. తెరపై అనిల్ కపూర్‌ను ముద్దు పెట్టుకోవడానికి తాను ఎందుకు అంగీకరించిందో మీనాక్షి శేషాద్రి వెల్లడించారు, ప్రముఖ దర్శకుడు యశ్ చోప్రా దర్శకత్వం వహించిన 1988 చిత్రం ‘విజయ్’లో అనిల్ కపూర్‌తో కలిసి నటించింది ముద్దు సన్నివేశంతో మీనాక్షి శేషాద్రి పెద్ద సంచలనం సృష్టించారు. కొన్నేళ్ల తర్వాత ఆనాటి బాలీవుడ్ సంప్రదాయ బద్ధమైన వాతావరణం ఉన్నప్పటికీ, ఆ సన్నివేశంలో నటించడానికి తాను ఎందుకు సౌకర్యవంతంగా భావించారో ఆ నటి వెల్లడించారు.
సెట్స్‌లో తనకు సౌకర్యవంతంగా ఉండేలా చేసినందుకు ఆమె యశ్ చోప్రా, అనిల్ కపూర్ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాళ్లు ఇద్దరూ చాలా వృత్తిపరంగా, నింపాదిగా, ప్రశాంతంగా ఉండే వారన్నారు. అంతగా తెలియని మరో విషయాన్ని కూడా వెల్లడించారు: డెకాయిట్ (1987) చిత్రంలో సన్నీ డియోల్‌తో ఆమెకు ఒక ముద్దు సన్నివేశం ఉంది, కానీ సినిమా విడుదలకు ముందే సెన్సార్ బోర్డు దానిని తొలగించింది . ఆసక్తికరంగా ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇక మీనాక్షి శేషాద్రి నటిగానే కాకుండా మంచి నృత్యకారిణి కూడా. తను 1980, 1990లలో మాధురీ దీక్షిత్, రవీనా టాండన్ , రాణీ ముఖర్జీ, అయేషా జుల్కా, తదితర నటీమణులతో పటీ పడ్డారు. ఇక మీనాక్షి శేషాద్రి అసలు పేరు శశికళ శేషాద్రి. 1963 నవంబర్ 16న అప్పటి బీహార్‌లోని సింద్రీలో జన్మించారు. తమిళ కుటుంబానికి చెందిన ఆమె చిన్నప్పటి నుంచే నృత్యంపై ఆసక్తి పెంచుకున్నారు.
1981లో తన 17వ ఏట ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంతో ఆమెకు సినీ రంగంలో అవకాశాలు వచ్చాయి. 1983లో ‘పెయింటర్ బాబు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు.అదే సంవత్సరం విడుదలైన హీరో సినిమా ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ సరసన నటించారు.
