చెన్నై : కోలీవుడ్ స్టార్ సూర్య కీ రోల్ పోషించచిన తాజా చిత్రం సీన్ దుమ్ము రేపుతోంది. భారీ వసూళ్లను సాధించింది. రికార్డులను తిరగ రాసింది. ఆశించిన దానికంటే పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ సాధించింది. ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు సాధించి విస్తు పోయేలా చేసింది. సీన్ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. సీన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. జితు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను చేరుకోవడానికి సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఆ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుందని భావిస్తున్నారు. ఈ టైమ్‌లైన్ ప్రకారం, ‘సీన్’ డిసెంబర్ 4న స్ట్రీమింగ్ ప్రారంభించవచ్చు
అయితే చిత్ర నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు స్ట్రీమింగ్ గురించి. ఈ చిత్రంలో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా నటించగా మలయాళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా గుర్తింపు పొందిన నజియా నజీమ్ మాయగా , నస్లేన్ ఈశ్వరన్గా కనిపించారు. నటులు లాల్, ఆనంద్ రాజ్ , జాన్ విజయ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. వరుస హత్యల కేసును దర్యాప్తు చేస్తున్న ఒక పోలీస్ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ గతంలో జరిగిన ఒక హత్య కేసుకూ, ఇటీవలి నేరాలకూ మధ్య ఉన్న సంబంధాన్ని అతను కనుగొంటాడు. నిజాన్ని వెలికి తీయడానికి అతను చేసే ప్రయత్నాల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది.
సూర్య, జ్యోతిక సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరికి కాసుల వర్షం కురిపించింది. థియేటర్లలో ‘సీన్’ చిత్రాన్ని చూడలేక పోయిన అభిమానులు ఇప్పుడు దాని డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓటీటీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
