Sania Mirza : ప్రపంచ టెన్నిస్ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న భారతీయ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా(Sania Mirza) ఇప్పుడు పునరాలోచనాలో పడ్డారు. ప్రస్తుత సీజన్ నుంచి తాను ఇక ఆడలేనంటూ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా క్రీడా లోకం విస్తు పోయింది.
టెన్నిస్ ఒక్కటే కాదు ఏ క్రీడ లోనైనా ఆటగాళ్లకు ఫిట్ నెస్ అనేది ప్రధానం. ఏ మాత్రం శారీరకంగా ఫిట్ గా లేక పోతే ఆడటం అన్నది కష్టం.
ఏ ప్లేయర్ ను కూడా ఆడేందుకు పరిగణలోకి తీసుకోదు ఏ క్రీడా సంస్థ. ఇక సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్ రంగానికి ఎనలేని సేవలందిస్తూ వస్తోంది హైదరాబాద్ కు చెందిన స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా(Sania Mirza).
ఆసిస్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఆ వెంటనే తాను ఇక త్వరలో ఆటకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించి విస్తు పోయేలా చేసింది.
దీంతో భారత్ తో పాటు పాకిస్తాన్ , ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు, టెన్నిస్ స్టార్లు, ఇతర ఆటగాళ్లు సైతం ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందని రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో సానియా మీర్జాకు ఎనలేని మద్దతు లభించింది. తనకు ఇంకా వయసు అయి పోలేదని, ఆడే సత్తా ఉందని ఇంత త్వరగా తప్పుకుంటే ఎలా అని తన నిర్ణయాన్ని మార్చు కోవాలని నెటిజన్లు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున కోరుతున్నారు.
దీంతో సానియా మీర్జా మరోసారి తాను తీసుకున్న నిర్ణయంపై ఆలోచనలో పడింది. తొందర పడ్డానేమోనని అలా ప్రకటించాల్సి ఉండేది కాదేమోనని ఆలోచనలో ఉందట.
ఏది ఏమైనా ఒక స్థాయికి వచ్చాక ప్రతి మాట చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఆ విషయం తెలుసుకుంటే మంచిది.
Also Read : దయచేసి మా వైపు కన్నేయండి