WI T20 ODI Squad : వెస్టిండీస్ టీ20, వ‌న్డే జ‌ట్ల ఎంపిక

వెల్ల‌డించిన విండీస్ క్రికెట్ బోర్డు

WI T20 ODI Squad : వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇవాళ భార‌త్ తో ఆడే విండీస్ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా టీమిండియాతో మూడు వ‌న్డేల సీరీస్ (WI T20 ODI Squad)ఆడ‌నుంది. ఇందులో భాగంగా ఇద్ద‌రిని అనూహ్యంగా జ‌ట్టులోకి తీసుకుంది బోర్డు.

వారిలో సీనియ‌ర్ బౌల‌ర్ కెమ‌ర్ రోచ్ కాగా మ‌రొక‌రు బోన్న‌ర్ ఉన్నారు. ఇది ఊహించ‌ని ప‌రిణామం అని చెప్ప‌క త‌ప్ప‌దు. అనామ‌క టీంగా పేర్కొన్న ఐర్లాండ్ తో బొక్క బోర్లా ప‌డింది విండీస్ జ‌ట్టు.

ఈ త‌రుణంలో కీల‌క మార్పులు చేసింది. ఇక భార‌త్ తో త‌ల‌ప‌డే విండీస్ టీమ్ కు కీర‌న్ పొలార్డ్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇప్ప‌టికే పొలార్డ్ కు భార‌త్ తో ద‌గ్గ‌రి అనుబంధం ఉంది.

ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియ‌న్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఇక్క‌డి పిచ్ ల స్వ‌భావం ఏమిటో బాగా తెలుసు పొలార్డ్. ఇది ఒక ర‌కంగా అత‌డికి అడ్వాంటేజ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌రో వైపు భార‌త జ‌ట్టు(WI T20 ODI Squad) స‌ఫారీ టూర్ సంద‌ర్భంగా మూడు వ‌న్డేల‌లో ఓడి పోయింది. ఇక టెస్టుల్లో ఒక‌టి గెలిచి రెండింట్లో చేతులు ఎత్తేసింది. దీంతో అటు వ‌న్డే ఇటు టెస్టు సీరీస్ కోల్పోయి తీవ్ర విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంది.

ఈ త‌రుణంలో ఇండియాలో ప‌ర్య‌టించే విండీస్ పై త‌ప్ప‌నిస‌రిగా స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంది. టూర్ లో భాగంగా విండీస్ టీం టీమిండియాతో మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడ‌నుంది. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే కెప్టెన్ గా పొలార్డ్ కొన‌సాగుతాడు.

అలెన్ , బోన్న‌ర్ , డారెన్ బ్రావో, ష‌మ‌ర్ బ్రూక్స్ , జేస‌న్ హోల్డ‌ర్, హోప్ , హోసేన్ , జోసె్ , బ్రాండ‌న్ కింగ్ , నికోల‌స్ పూరన్ , కెమ‌ర్ రోచ్ , షెఫ‌ర్డ్ , స్మిత్ , జూనియ‌ర్ ఉన్నారు.

Also Read : వాళ్ల‌ను తీసేసి కొత్త వాళ్ల‌ను తీసుకోవాలి

Leave A Reply

Your Email Id will not be published!