IND U19 vs AUS U19 : ఆస‌క్తిక‌ర పోరులో విజేత ఎవ‌రో

సెమీ ఫైన‌ల్ లో భార‌త్, ఆసిస్

IND U19 vs AUS U19 : వెస్టిండీస్ వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఇప్ప‌టికే యువ భార‌త జ‌ట్టు టైటిల్ హాట్ ఫేవ‌రేట్ గా ఉన్న‌ప్ప‌టికీ గ‌త ఏడాది బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి పాలై ర‌న్న‌ర్ అప్ గా నిలిచింది.

తాజాగా జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో యువ బంగ్లా ఆట‌గాళ్ల‌కు చుక్క‌లు చూపించి ఘ‌న విజ‌యాన్ని నమోదు చేసింది టీమిండియా. మ‌రో వైపు అండ‌ర్ 19 యువ ఇంగ్లండ్ జ‌ట్టు ఊహించ‌ని రీతిలో 24 ఏళ్ల సుదీర్ఘ కాలం అనంత‌రం వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు చేరుకుంది.

దీంతో ఇవాళ అంటిగ్వా వేదిక‌గా జ‌రిగే మ్యాచ్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ మ్యాచ్ లో ఏ జ‌ట్టు అయితే గెలుపు సాధిస్తుందో ఆ టీమ్ నేరుగా ఇంగ్లండ్ తో వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం పోటీ ప‌డుతుంది.

ఇక గ‌త రెండు అండ‌ర్ -19 (IND U19 vs AUS U19 )ప్రపంచ క‌ప్ ల‌లో టీమిండియా, ఆస్ట్రేలియా రెండు సార్లు నాకౌట్ ద‌శ‌లో త‌ల‌ప‌డ్డాయి. ఈ రెండు సార్లూ యువ భార‌త జ‌ట్టు విజ‌య కేత‌నం ఎగుర వ‌సింది.

దీంతో ఈ మ్యాచ్ పై భార‌త్ గంపెడు ఆశ‌లు పెట్టుకుంది. ఇదిలా ఉండ‌గా భార‌త సీనియ‌ర్ జ‌ట్టు వ‌రుస అప‌జ‌యాల‌తో నిరాశ ప‌రుస్తున్నారు. కాగా యువ భార‌త జ‌ట్టు మాత్రం అద్భుత విజ‌యాలు న‌మోదు చేస్తూ త‌మ‌కు ఎదురే లేదంటూ చాటుతోంది.

ఇక 2018లో షా నాయ‌క‌త్వంలో ఆసిస్ ను ఓడించి టైటిల్ స్వంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ గ‌నుక మ‌నం గెలిస్తే వ‌రుస‌గా నాలుగోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్ కు చేరుకున్న వాళ్లం అవుతాం.

Also Read : ఐపీఎల్ మెగా వేలంలో మ‌నోళ్లు

Leave A Reply

Your Email Id will not be published!