Thalapathy Vijay : రాజకీయ, సినీ వర్గాలను విస్తు పోయేలా ఒక్కోసారి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. రెండు రంగాలకు సమాజంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది.
ఈ తరుణంలో తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన నటుడు తలపతి విజయ్. తలైవా రజనీకాంత్ ఓ వైపు విజయ్ ఇంకో వైపు టాప్ మోస్ట్ సెలబ్రెటీలుగా ఇప్పటికే పేరొందారు.
తమిళనాడు రాష్ట్రంలో విజయ్(Thalapathy Vijay) కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక బీజేపీ తీసుకు వచ్చిన జీఎస్టీపై ఆయన సెటైర్లు కూడా విసిరారు. ఈ తరుణంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.
విజయ్, పుదుచ్చేరి కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయానికి సంబంధించి ట్విట్టర్ వేదికగా ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
సీఎం రంగగస్వామి విజయ్ ను కలిసినట్లు అంశం దావానలంలా వ్యాపించింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు విజయ్ ఇంట్లో ఈ మీటింగ్ జరిగినట్లు టాక్.
ఇందులో భాగంగా దీనిపైనే ప్రధానంగా ముచ్చటించినట్లు తెలిసింది. ఇది పూర్తిగా గంటకు పైగా సాగింది. ఇక సీఎం రంగసామి ప్రకారం విజయ్ ను మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపినట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్(Thalapathy Vijay) ప్రజా ఉద్యమం పోటీ చేస్తోంది. ఇక విజయ్ ఇటీవలే బీస్ట్ మూవీని పూర్తి చేశాడు. పూజా హెగ్డే ఇందులో ప్రధాన నాయికగా నటించారు.
ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తారు. సెల్వ రాఘవన్ , యోగి బాబు, తదితరులు నటించారు.
Also Read : దీపికతో రొమాన్స్ చెప్పలేని ఫీలింగ్