Bheemla Nayak Movie : 25న రానున్న భీమ్లా నాయ‌క్

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Bheemla Nayak Movie : సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయ‌క్ (Bheemla Nayak Movie)నుంచి అప్ డేట్ వ‌చ్చింది. ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో ఉత్కంఠ‌కు తెర దించుతూ ఈనెల 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్ .

సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ వంశీ భీమ్లా నాయ‌క్ (Bheemla Nayak Movie)ను నిర్మించాడు. వ‌కీల్ సాబ్ మూవీ త‌ర్వాత వస్తున్న చిత్రం కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి ఈ చిత్రంపై.

ఈ సినిమాకు మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే స‌మ‌కూర్చుతున్నారు. ఇప్ప‌టికే ఎస్ఎస్ థ‌మ‌న్ అందించిన పాట‌లు భారీ ఆద‌ర‌ణ చూర‌గొన్నాయి.

మ‌ల‌యాళం లో సూప‌ర్ హిట్ గా నిలిచిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ మూవీకి భీమ్లా నాయ‌క్ రీమేక్ గా వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ద‌గ్గుబాటి రానా న‌టించాడు ఇందులో.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ కరోనా కార‌ణంగా వాయిదా వేశారు. ఇప్పుడు డిక్లేర్ చేశారు సినిమా రిలీజ్ డేట్ ను. 2021 జ‌న‌వ‌రి 25న హైద‌రాబాద్ లో షూటింగ్ ప్రారంభ‌మైంది.

మార్చి చివ‌ర్లో క‌రోనా కార‌ణంగా నిలిపి వేశారు. జూలై 12 నుంచి తిరిగి షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కిన్నెర మొగుల‌య్య పాడిన టైటిల్ సాంగ్ హిట్ గా నిలిచింది.

ప‌వ‌న్ , రాణాతో పాటు నిత్యా మీన‌న్ , ఐశ్వ‌ర్య రాజేశ్ , బ్ర‌హ్మానందం, స‌ముద్ర‌ఖ‌ని, ముర‌ళీ శ‌ర్మ‌, బ్ర‌హ్మాజీ, న‌ర్రా శ్రీ‌ను న‌టించారు.

Also Read : అది స్కిన్ షో కాదు క‌థ కోస‌మే

Leave A Reply

Your Email Id will not be published!