Vivek Agnihotri : ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఆయన తీసిన ఈ మూవీ వసూళ్లను తిరగ రాస్తోంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి మనోడు భోపాల్ వాసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారంతా స్వలింగ సంపర్కులంటూ చేసిన వ్యాఖ్యలు అగ్గిని రాజేశాయి. వివేక్ అగ్నిహోత్రిపై(Vivek Agnihotri) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్.
ఒకవేళ నీకు అలాంటి అనుభవం ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. భోపాల్ ప్రజలది కాదు. నేను 77 ఏళ్ల నుంచి భోపాల్ , ఇక్కడి ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నానని పేర్కొన్నాడు.
మీకు జరిగిన అనుభవం అలా మీ ద్వారా అనిపించి ఉండవచ్చంటూ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించాడు డిగ్గీ రాజా. దేశ వ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, మేధావులు, బుద్దిజీవులు, సామాజికవేత్తలు, సినీ రంగానికి చెందిన వారు సైతం వివేక్ అగ్ని హోత్రి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెట్టిల్లు వేదికగా మండిపడుతున్నారు. ఇది పరిణతి చెందిన దర్శకుడి మాటలు కావని హితవు పలికారు. వివేక్ పై సర్వత్రా దాడి మొదలైంది. వివరణ కోరేందుకు వెళ్లినా తప్పించుకుని వెళ్లి పోయారు.
నిన్నటి దాకా ఆయన హీరోగా మారి పోతే ఇవాళ ఒకే ఒక్క మాటతో విలన్ గా మారి పోయారు. సోషల్ మీడియా వచ్చాక కాస్తా ఆలోచించి మాట్లాడాలి. అది సామాన్యుడికైనా ప్రధానికైనా వర్తిస్తుందన్నది వాస్తవం.
Also Read : ఆర్ఆర్ఆర్ మూవీ సూపర్ హిట్ – తారక్