Will Smith : చెంప ఛెల్లుమ‌నిపించిన స్మిత్ 

బెస్ట్ యాక్ట‌ర్ గా అవార్డు 

Will Smith : ప్ర‌పంచ సినీ జ‌గ‌త్తులో అద్భుత‌మైన న‌టుడిగా పేరొందారు విల్ స్మిత్(Will Smith). ఏ పాత్ర లోనైనా ఇమిడి పోయే స్వ‌భావం ఉండ‌డంతో వ‌ర‌ల్డ్ వైడ్ గా మ‌రింత  పాపుల‌ర్ అయ్యాడు.

స్మిత్ కు ఇప్పుడు 53 ఏళ్లు. ఇదిలా ఉండ‌గా 94వ ఆస్కార్ అవార్డుల (94th Oscar Awards) ప్ర‌ధానోత్స‌వం అంగ‌రంగ వైభవంగా అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా కింగ్ రిచ‌ర్డ్ మూవీకి గాను అత్యుత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యాడు విల్ స్మిత్.

ఉత్త‌మ న‌టుడి అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ స‌మ‌యంలో అనుకోని ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్టేజిపై మాట్లాడుతున్న క్రిస్ రాక్ (Chris Rock) విల్ స్మిత్ భార్య గురించి మాట తూలాడు.

దీంతో త‌ట్టుకోలేక పోయిన స్మిత్ (Will Smith)సీరియస్ అయ్యాడు. రాక్ చెంప ఛెల్లుమ‌నిపించాడు. అవార్డుల కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వాళ్లంతా అవాక్క‌య్యారు. అవార్డు ఇచ్చేందుకు వ‌స్తూనే విల్ స్మిత్ భార్య , న‌టి అయిన జాడా పింకెట్ స్మిత్ మీద కామెంట్ చేశాడు.

అప్ప‌టి వ‌ర‌కు కూల్ గా ఉన్న విల్ స్మిత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. సీరియ‌స్ అవుతూనే మండిప‌డ్డాడు. క్రిస్ రాక్ పై దాడికి దిగాడు. వివ‌ర‌ణ ఇవ్వ‌బోతుండ‌గా ప‌ట్టించు కోలేదు విల్ స్మిత్.

నోరు మూసుకోక పోతే బాగుండందంటూ వార్నింగ్ ఇచ్చాడు క్రిస్ రాక్ కు. ప్ర‌స్తుతం విల్ స్మిత్ దాడి చేసిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

త‌న త‌ప్పు తెలుసుకున్న క్రిస్ రాక్ (Chris Rock) సారీ చెప్ప‌డం కూడా జ‌రిగి పోయింది. ఇదిలా ఉండ‌గా క‌న్నీళ్లు పెట్టుకున్నాడు విల్ స్మిత్ అవార్డు అందుకున్న స‌మ‌యంలో. క్రిస్ రాక్ (Chris Rock) ప‌ట్ల తాను క్ష‌మాప‌ణ వేడుకుంటున్నాన‌ని తెలిపాడు కూడా.

Also Read : స్థిర‌ప‌డ్డాకే నాన్న‌తో సినిమా – అహ‌న్ శెట్టి

Leave A Reply

Your Email Id will not be published!