Deepika Padukone : ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన ఘనత సాధించింది. ఇటీవల ఆమె నటించిన గెహరియాన్ కలకలం రేపింది. మానవ సంబంధాలపై వచ్చిన ఈ మూవీలో శ్రుతి మించి శృంగారం ఒలికించిందన్న ఆరోపణలు ఎదుర్కొంది.
ఇక వివాదాస్పద నటి కంగనా రనౌత్ అయితే దీనిని పూర్తిగా పోర్న్ ఫిలిం అంటూ మండిపడింది. ఈ తరుణంలో సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న దీపికా పదుకొనేకు(Deepika Padukone) కొంచెం ఊరట నిచ్చేలా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టైమ్ మ్యాగజైన్ 100 ఇంపాక్ట్ జాబితాలో చోటు దక్కింది.
దీంతో గతంలో వచ్చిన ఆరోపణలకు సేవ రూపంలో ఆన్సర్ దొరికిందన్నమాట. ప్రపంచాన్ని విస్తృతంగా ప్రభావితం చేయడం , సేవ లేదా ఇతర మార్గాల ద్వారా కృషి చేసినందుకు గాను టైమ్ ప్రతి ఏటా ఇంపాక్ట్ 100 జాబితాను ఎంపిక చేస్తుంది.
ఎవర్ టైమ్ 100 ఇంపాక్ట్ కింద శాస్త్రవేత్తలు, సిఇఓలు, కళాకారులు, కార్యకర్తలు, పాప్ స్టార్లు, రాజకీయ నాయకులతో సహా ఎంపిక చేస్తుంది. వారిలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఉండడం విశేషం.
దీపికా నటి మాత్రమే కాదు నిర్మాత కూడా. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్బంగా దీపికా పదుకొనే(Deepika Padukone) తన ఇన్ స్టా గ్రామ్ లో తనకు ఇవాళ శుభదినం అని పేర్కొంది.
టైమ్ ఇంపాక్ట్ 100లో తనకు చోటు దక్కినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. 2015లో ఆమె డిప్రెషన్ కు గురైంది. ఆనాటి నుంచి దానిపై పోరాడుతూ వస్తోంది.
ఈ సమయంలో తాను కౌన్సెలింగ్ ద్వారా స్వాంతన పొందానని తెలిపింది. ఆనాటి నుంచి మానసిక పరమైన భరోసా ఇచ్చే కేంద్రాన్ని నిర్వహిస్తూ వస్తోంది.
Also Read : విల్ స్మిత్ భావోద్వేగం మన్నించమని విన్నపం