Kendra Lust Shami : ష‌మీ ప్ర‌తాపం ముద్దుగుమ్మ ఆనందం

అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న అంటూ కితాబు

Kendra Lust  : భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ఐపీఎల్  (Shami) లో దుమ్ము రేపాడు. మ‌నోడిని ఈసారి ఐపీఎల్ (IPL) లో గుజ‌రాత్ టైటాన్స్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది.

ఈ త‌రుణంలో ల‌క్నో సెయింట్ జెయింట్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో అద్భుత‌మైన బౌలింగ్ తో (Shami) దుమ్ము రేపాడు. ఏకంగా మూడు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. నిప్పులు చెరిగే బంతుల‌తో ప్ర‌త్య‌ర్థుల బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

ప‌రుగులు తీసేందుకు తీవ్ర ఇబ్బంది ప‌డ్డారు. మొద‌టి బాల్ కు కేఎల్ రాహుల్ ను ఔట్ చేశాడు. డికాక్ తో పాటు మ‌నీష్ పాండేను పెవిలియ‌న్ కు పంపించాడు.

దీంతో త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. 4 ఓవ‌ర్ల‌లో 25 ర‌న్స్ ఇచ్చాడు వికెట్లు తీశాడు. ఈ త‌రుణంలో మ‌నోడిని ఆకాశానికి ఎత్తేశారు ఫ్యాన్స్. ఇదే స‌మ‌యంలో దుబాయి వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ తో భారీగా ప‌రుగులు ఇచ్చాడు.

దీంతో దేశ వ్యాప్తంగా ట్రోలింగ్ కు గుర‌య్యాడు. ఆ త‌ర్వాత జ‌రిగిన సీరీస్ ల‌లో స‌త్తా చాటాడు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి అమెరికా తార కెండ్రా ల‌స్ట్(Kendra Lust )ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది.

మ‌నోడి ఆట తీరు అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చింది. దీంతో ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ గా మారింది. అంతే కాకుండా కెండ్రా ల‌స్ట్ (Kendra Lust) ల‌వ్, ఎమోజీల‌ను కూడా కామెంట్ కు జ‌త చేసింది.

ఇది ఇప్పుడు హాట్ టాప్ గా న‌డుస్తోంది. కొంద‌రేమో ఆమెతో ఎప్ప‌టి నుంచి డేటింగ్ చేస్తున్నావంటూ ట్రోలింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్ .

Also Read : ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో కీవీస్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!