Yuzuvendra Chahal : హ‌స‌రంగ రియ‌ల్ ఛాంపియ‌న్ – చ‌హ‌ల్

కితాబు ఇచ్చిన ఆర్ఆర్ క్రికెట‌ర్

Yuzuvendra Chahal  : ప్ర‌పంచ క్రికెట్ లో క్రీడా స్ఫూర్తిని చాట‌డంలో భార‌తీయ క్రికెట‌ర్లు ముందుంటారు. మొన్న‌టికి మొన్న దుబాయి వేదిక‌గా జ‌రిగిన టీ20 మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ తో ఓట‌మి పాల‌య్యాక విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, ఎంఎస్ ధోనీ అభినందించ‌డం యావ‌త్ క్రీడా లోకాన్ని విస్తు పోయేలా చేసింది.

దీనిని ఐసీసీ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో అద్బుతం అంటూ కొనియాడింది. ఇక తాజాగా న్యూజిలాండ్ వేదిక‌గా జ‌రుగుతున్న మహిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ కెప్టెన్ త‌న‌య‌ను ఎత్తుకుని ముద్దాడిన భార‌తీయ మ‌హిళా క్రికెట‌ర్ల క్రీడా స్ఫూర్తికి పాకిస్తాన్ తో పాటు భార‌త్, యావ‌త్ ప్ర‌పంచం ఫిదా అయ్యింది.

తాజాగా అలాంటి సీన్ రిపీట్ అయ్యింది ఐపీఎల్ 2022లో. నిన్న కేకేఆర్ తో ఆర్సీబీ మ్యాచ్ జ‌రిగింది. శ్రీ‌లంక జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ‌నిందు హ‌స‌రంగా అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు.

కేవ‌లం 4 ఓవ‌ర్లు వేసి 20 ప‌రుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. ఆర్సీబీకి అద్భుత‌మైన విజ‌యాన్ని అందించాడు. ఈ సంద‌ర్భంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న య‌జువేంద్ర చ‌హ‌ల్(Yuzuvendra Chahal )అస‌రంగ‌ను ఆకాశానికి ఎత్తేశాడు.

వ‌నిందు నువ్వు మామూలోడివి కాదు రియ‌ల్ ఛాంపియ‌న్ వి అంటూ కితాబు ఇచ్చాడు. ప్ర‌స్తుతం చ‌హ‌ల్ చేసిన ఈ కామెంట్స్ కు క్రీడా లోకం ఫిదా అవుతోంది.

ఇలాంటి ప‌రస్ప‌ర అభినంద‌న‌లే క్రీడా స్పూర్తికి మార్గంగా ప‌నికి వ‌స్తాయ‌ని ఫ్యాన్స్ తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు.

Also Read : ఈసారి ఢిల్లీ క్యాపిట‌ల్స్ దే ఐపీఎల్

Leave A Reply

Your Email Id will not be published!