Harnaaz Sandhu : భ‌గ‌వంత్ మాన్ అంటే అభిమానం

మిస్ యూనివ‌ర్స్ హ‌ర్నాజ్ కౌర్ సంధు

Harnaaz Sandhu  : మిస్ యూనివ‌ర్స్ హ‌ర్నాజ్ కౌర్ సంధు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమాన‌మ‌ని చెప్పారు.

హ‌ర్నాజ్ సంధు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవ‌ల ఎంపీగా నామినేట్ అయిన ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాను కూడా క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయిన హ‌ర్నాజ్ సంధును(Harnaaz Sandhu )అభినందించారు సీఎం భ‌గ‌వంత్ మాన్. ఇదిలా ఉండ‌గా భ‌గ‌వంత్ మాన్ కు వీరాభిమాన‌నిని చెప్పారు విశ్వ సుంద‌రి. త‌క్కువ స‌మ‌యంలో సీఎం చేసిన ప‌నుల్ని ఆమె మెచ్చుకున్నారు.

కాగా మిస్ యూనివ‌ర్శ్ గా ఎంపికైన హ‌ర్నాజ్ సంధు పోటీ సంద‌ర్భంగా న్యాయ నిర్ణేత‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ధీటైన స‌మాధానం ఇచ్చింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది.

పంజాబ్ రాష్ట్రంలోని చండీగ‌ఢ్ స్వ‌స్థ‌లం హ‌ర్నాజ్ సంధుది. వీరిద్ద‌రి భేటీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. 21 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశానికి మిస్ యూనివ‌ర్స్ టైటిల్ ను తీసుకు రావ‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు.

ఆమె ప్ర‌త్యేకించి పంజాబీ సూట్ , పుల్కారీలో క‌నిపించ‌డం విశేషం. హ‌ర్నాజ్ కౌర్ సంధుకు పంజాబ్ తో గాఢ‌మైన అనుబంధం ఉంది. సీఎంతో భేటీ అనంత‌రం విశ్వ సుంద‌రి మీడియాతో మాట్లాడారు.

పంజాబ్ కోసం ఏదో ఒక‌టి చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. త‌క్కువ స‌మ‌యంలో ప‌లు మార్పులు తీసుకు వ‌చ్చిన సీఎంను ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : నారీ శ‌క్తి పుర‌స్కారాలు ప్ర‌దానం

Leave A Reply

Your Email Id will not be published!